Animal: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, రష్మిక జంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సలార్. డిసెంబర్ 1 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. రికార్డ్ కలక్షన్స్ రాబట్టి.. ఈ ఏడాది మొత్తంలోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాలో రణబీర్ నటన, సందీప్ టేకింగ్ అంతా ఒక ఎత్తు అయితే.. త్రిప్తి దిమ్రి సీన్స్ మరో ఎత్తు. రష్మిక కన్నా ఆమెకే ఎక్కువ పేరు వచ్చింది. అంతలా ఆమె అభిమానులకు కనెక్ట్ అయ్యింది. ముఖ్యంగా ఎవరెవరో సాంగ్ అయితే.. అందరి ఫేవరేట్ గా నిలిచింది. లిరికల్ సాంగ్ వచ్చినప్పుడే.. లిరిక్స్ కు అభిమానులు ఫిదా అయ్యారు. ఇక థియేటర్ లో వీడియో చూసి.. ఈ సాంగ్ కు ఫ్యాన్స్ గా మారిపోయారు.
తాజాగా ఎవరెవరో వీడియో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేసారు. ఎప్పటినుంచో ఈ వీడియో సాంగ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న విషయం తెల్సిందే. ఇక తాజాగా ఈ సాంగ్.. యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. త్రిప్తి, రణబీర్ ల ఘాటు రొమాన్స్.. ప్రేమ ఈ సాంగ్ లో కనిపిస్తుంది. అనంత్ శ్రీరామ్ రాసిన లిరిక్స్.. విశాల్ మిశ్రా వాయిస్ తో ఈ సాంగ్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్లగా.. బెడ్ పై రణబీర్ , త్రిప్తిల ఘాటు పోజ్.. సందీప్ టేకింగ్ అయితే ఎక్స్ట్రార్డినరీ అని అభిమానూలు చెప్పుకొస్తున్నారు. మరి ఈ వీడియో సాంగ్ ఎన్ని మిలియన్ వ్యూస్ సాధిస్తుందో చూడాలంటే రేపటివరకు ఆగాల్సిందే
