NTV Telugu Site icon

Sandeep Reddy Vanga : వాళ్ళు సినీ నిరక్షరాస్యులు.. డబ్బివ్వలేదనే ఇలా.. క్రిటిక్స్ పై యానిమల్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

Sandeep Reddy Vanga

Sandeep Reddy Vanga

Animal director Sandeep Reddy Vanga calls critics illiterate: డిసెంబర్ మొదటి తేదీన విడుదలైన ‘యానిమల్’ టాప్ సూపర్ స్టార్స్ లిస్ట్ లో రణబీర్ కపూర్ ను చేర్చింది. ఈ సినిమాలో విలన్‌గా నటించిన బాబీ డియోల్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఈ సినిమా దెబ్బకి తృప్తి డిమ్రీ ఇప్పుడు మంచి క్రేజ్ తెచ్చుకుంది, అభిమానులు సోషల్ మీడియాలో ‘నేషనల్ క్రష్’ అని పిలవడం ప్రారంభించారు. అయితే ఈ విషయాలన్నీ పక్కన పెడితే ‘యానిమల్’ బాలీవుడ్ లో నిరంతర విమర్శలను ఎదుర్కొంటోంది. సినిమాలోని చాలా సన్నివేశాలు సినీ విమర్శకులకు జీర్ణించుకోలేనివి అనిపించడంతో పలు విమర్శలు వచ్చాయి. ఈ సినిమా కంటెంట్ సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారింది. ‘యానిమల్’ అనేది మహిళలకు వ్యతిరేకమని, విషపూరితమైన పురుషాధిక్యతను ప్రచారం చేస్తుందని అంటూ కొందరు ఫెమినిస్టులు సైతం కామెంట్ చేశారు. ఇన్ని విమర్శల మధ్య ఇప్పుడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా క్రిటిక్స్ గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. సందీప్ రెడ్డి వంగా కనెక్ట్ ఎఫ్ఎమ్ కెనడాతో మాట్లాడుతూ, ఈ సినిమా మీద వారు విమర్శలు చేయడం వింతగా ఉందని అన్నారు.

Ramcharan -Upasana : క్లింకారతో మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న రామ్ చరణ్-ఉపాసన..

యానిమల్‌పై వచ్చిన అతిపెద్ద విమర్శ సినిమా స్త్రీ ద్వేషపూరితమైనదని దీనిపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్పందిస్తూ.. తన సినిమాలను మహిళా వ్యతిరేకి అని పిలిచే వారిని జోకర్ అని అన్నారు. నా ప్రొడక్షన్ హౌస్ పేరు భద్రకాళి పిక్చర్స్, అలా దానికే స్త్రీ పేరు పెట్టిన నేను స్త్రీ ద్వేష సినిమా చేస్తా అని ఎందుకు అనుకుంటున్నారో నాకు తెలియదని అన్నారు. అలాగే చాలా మంది అలా అనుకోరు, ఈ 15-20 మంది జోకర్లు(క్రిటిక్స్) మాత్రమే అలా అనుకుంటున్నారని అన్నారు. ఇక సినిమా మీద కంటే దర్శకుడి మీద ద్వేషం ఉన్నపుడు సినిమా ఎలా ఉన్నా రివ్యూ తేడాగానే ఉంటుందని ఆయన అన్నాడు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ముగ్గురు బాలీవుడ్ విమర్శకులను సినిమా నిరక్షరాస్యులుగా అభివర్ణించారు. అనుపమ చోప్రా, రాజీవ్ మసంద్ మరియు సుచరిత త్యాగి వంటి విమర్శకులు నిరక్షరాస్యులని, ఎందుకంటే వారు తమ రివ్యూస్ లో చిత్రనిర్మాణం, క్రాఫ్ట్, ఆర్ట్ గురించి చర్చించరని అన్నాడు. కేవలం సెన్సిటివ్ పార్ట్ మీదనే చర్చలు పెడతారని అన్నాడు. తన మునుపటి చిత్రం “కబీర్ సింగ్”పై వారి దుర్మార్గపు దాడి కారణంగా తన తాజా చిత్రం “యానిమల్” భారీ ఓపెనింగ్ పొందిందని అతను పేర్కొన్నాడు.

అనుపమచోప్రా విడుదలకు ముందు ఆమెను కలవాలని అభ్యర్థిస్తూ 6-7 సార్లు నాకు నిరంతరం మెసేజ్ చేసేది, రాజీవ్ మసంద్ కూడా నా సినిమా మీద నెగటివ్ రివ్యూ ఇచ్చిన తరువాత రౌండ్ టేబుల్‌ కోసం రమ్మని అడిగాడు కానీ నేను వెళ్లలేదని సందీప్ చెప్పుకొచ్చాడు. నేను 50 మందికి నచ్చేలా సినిమా తీయలేదు., బహుశా ఎండ్ షాట్ కారణంగా వారు అలా అనుకున్నారు, కానీ అది నా ఉద్దేశ్యం కాదు. పార్ట్ 2 కోసం ప్రేక్షకులు ఆలోచించి రూట్ చేయాలని నేను కోరుకున్నా అని ఆయన అన్నారు. ఇక ముంబయిలో దాదాపు 5 సంవత్సరాలు గడిపిన తర్వాత, నాకు ఇప్పుడు ఒక విషయం అర్థమైంది, అక్కడ ఒక ముఠా ఉంది. వారు ఒక ప్రత్యేకమైన సినిమాని మాత్రమే ఇష్టపడతారు, వారు ప్రత్యేక ఫిలిం మేకర్స్ ను ప్రశంసించరు. క్రిటిక్స్ కి డబ్బు ఇచ్చే సంస్కృతి ఉండేదని అయితే దాన్ని తాను ఫాలో అవ్వలేదని ఆయన చెప్పుకొచ్చాడు. ఇక యానిమల్ కే ఇంత ఫీలయ్యారు క్రిటిక్స్, రేపు స్పిరిట్, చూస్తే ఏమైపోతారో? యూనిమల్ పార్క్ చూస్తే చచ్చిపోతారేమో! అంటే వాళ్ళు క్రిటిసైజ్ చేస్తున్నారని ఇంకా ఎక్కువ చేస్తాను అనట్లేదు… కంటెంట్ అలాంటిదని ఆయన చెప్పుకొచ్చారు.

Show comments