సందీప్ రెడ్డి వంగ క్రియేట్ చేసిన లేటెస్ట్ మూవీ అనిమల్, ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. రణబీర్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమా మొదటి వారం కంప్లీట్ అయ్యే సరికి 500 కోట్ల మార్క్ ని రీచ్ అయ్యింది. అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అయ్యి ప్రాఫిట్స్ లోకి ఎంటర్ అయింది అనిమల్ మూవీ. సక్సస్ ఫుల్ గా సెకండ్ వీక్ లోకి ఎంటర్ అవుతున్న అనిమల్ సినిమా ఓవరాల్ గా ఫస్ట్ వీక్ లో 563.3 కోట్లని రాబట్టింది. ఇది రణబీర్ కపూర్ కెరీర్ కే హయ్యెస్ట్ కలెక్షన్స్. డిసెంబర్ 21న డంకీ సినిమా వచ్చే వరకూ అనిమల్ మూవీ కలెక్షన్స్ స్లో అయ్యేలా కనిపించట్లేదు. ఆల్మోస్ట్ ఇంకో 13 రోజుల పాటు అనిమల్ మూవీ సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబట్టడం గ్యారెంటీ. 13 రోజుల్లో రోజుకి పది కోట్లు వేసుకున్నా కూడా అనిమల్ సినిమా ఓవరాల్ గ్రాస్ 700 కోట్లని చేరుకుంటుంది.
ఇదే జరిగితే సందీప్ రెడ్డి వంగ, రణబీర్ కపూర్ లు కలిసి అద్భుతం చేసినట్లే. ఒక A రేటెడ్ సినిమా ఇండియాలో ఈ స్థాయి కలెక్షన్స్ ని రాబట్టడం ఇదే మొదటిసారి. ఇండియాలోనే కాదు ఓవర్ సీస్ లో కూడా అనిమల్ మూవీ సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. నార్త్ అమెరికాలోనే 9 మిలియన్ డాలర్స్ మార్క్ ని క్రాస్ చేసి 10 మిలియన్ డాలర్స్ కి చేరువలో ఉంది. ఈరోజు నుంచి వీకెండ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అనిమల్ కలెక్షన్స్ లో మళ్లీ గ్రోత్ కనిపించడం గ్యారెంటీ. తెలుగులో మాత్రం అనిమల్ సినిమా కలెక్షన్స్ లో డ్రాప్ కనిపించే అవకాశం ఉంది. హాయ్ నాన్న, ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమాలు రిలీజ్ అవ్వడంతో తెలుగులో అనిమల్ థియేటర్స్ తగ్గే ఛాన్స్ ఉంది.
Epic Triumph #Animal🔥🪓#AnimalHuntBegins #BloodyBlockbusterAnimal #AnimalInCinemasNow #AnimalTheFilm
Book Your Tickets 🎟️ https://t.co/kAvgndK34I#AnimalInCinemasNow #AnimalTheFilm @AnimalTheFilm @AnilKapoor #RanbirKapoor @iamRashmika @thedeol @tripti_dimri23… pic.twitter.com/Y2abySf1Bm
— Animal The Film (@AnimalTheFilm) December 8, 2023
#Animal crossed the magical $9 million. Upwards and onwards!#Animal #AnimalBoxOffice #AnimalHuntBegins pic.twitter.com/bJBRgNQqs8
— Nirvana Cinemas (@NirvanaCinemas) December 7, 2023