Anil Sunkara Whatsapp Chat Leaked: కొద్దిరోజుల క్రితం రిలీజ్ అయిన భోళా శంకర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పూర్తిగా బోల్తా పడే పరిస్థితి కనిపిస్తోంది. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన వేదాళం అనే సినిమాని తెలుగులో భోళా శంకర్ పేరుతో చిరంజీవి హీరోగా రీమేక్ చేశారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద అనిల్ సుంకర నిర్మాతగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించగా అనేక మంది స్టార్ నటీనటులు కూడా సినిమాలో నటించారు. చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ కనిపించగా ఆమె ప్రియుడిగా సుశాంత్ ఒక అతిథి పాత్రలో నటించాడు. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాకి మెగాస్టార్ చిరంజీవి 65 కోట్లు రెమ్యునరేషన్ అడిగారని, అంత అప్పటికప్పుడు ఇచ్చుకోలేక సినిమా రిలీజ్ ఆగకూడదు అని అనిల్ సుంకర ఆస్తులు తాకట్టు పెట్టి ఆయనకు డబ్బు సమకూర్చినట్టు ప్రచారం జరిగింది. అంతేకాక అనిల్ సుంకర చిరంజీవిపై పరోక్షంగా వ్యాఖ్యలు చేసినట్టు ప్రచారం జరుగుతూ ఉండగా ఈ విషయం మీద ఆయన ఒకరికి వాట్సాప్ వేదికగా స్పందించారు.
Bhola Shankar: డిజాస్టర్ భోళా.. పండుగ చేసుకోవడానికి రెడీ అవుతున్న క్రికెట్ ఫ్యాన్స్
చిరు మీద అనిల్ సుంకర చేసినట్టుగా ఉన్న వ్యాఖ్యల స్రీన్ షాట్ పెట్టి సార్ ఇది నిజమేనా? అని సదరు అభిమాని అడిగితే నో.. వే.. నేను ఇప్పుడు అమెరికాకు వెళ్తున్నాను అని అనిల్ సుంకర రిప్లై ఇచ్చినట్టు ఉంది. ఈ న్యూస్ వైరల్ అవుతుంది సర్.. కొద్దిగా చూడండి.. అని సదరు అభిమాని మెసేజ్ చేయగా దానికి అనిల్ సుంకర కూల్ గా సమాధానం ఇచ్చారు. అవన్నీ పట్టించుకోవద్దండి, నేను మళ్లీ చిరంజీవి గారితో ఇంకో సినిమా చేస్తాను, ఆయన చాలా మంచివారు, సినిమాతోనే సమాధానం చెబుదాం అంటూ అనిల్ సుంకర చెప్పినట్టు ఆ స్క్రీన్ షాట్ లో కనిపిస్తుంది. అయితే మెగాస్టార్ చిరంజీవి పేరుతో మిలియన్ ఫాలోవర్స్ ఉన్న పేజ్ నుంచి ఈ స్క్రీన్ షాట్ షేర్ చేసినా ఇప్పుడైతే డిలీట్ చేశారు. కాబట్టి ఇది నిజమో కాదో అనిల్ సుంకర క్లారిటీ ఇస్తే తప్ప ఈ ప్రచారాలకు తెర పడేలా కనిపించడం లేదు.