Anil Sunkara: చిరంజీవితో వివాదం.. అదంతా చెత్త అన్న నిర్మాత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anil Sunkara: సినిమా రంగంలో ప్రశంసలు మాత్రం కాదు విమర్శలు కూడా ఉంటాయి. సినిమా హిట్ అయితే పొగిడిన నోరే.. ప్లాప్ అయితే తిట్టిపోస్తుంది. ఇక ఈ మధ్యకాలంలో సినిమా ప్లాప్ అయితే నిర్మాతకు హీరోకు మధ్య విబేధాలు ఉన్నాయని పుకార్లు సృష్టించేస్తున్నారు. హీరో వలనే నిర్మాత నష్టపోయినట్లు.. అది వారే అన్నట్లు ఫేక్ న్యూస్ ను సృష్టించి నెట్టింట వైరల్ గా మారుస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి నిర్మాత అనిల్ సుంకర ఇలాంటి ఫేక్ న్యూస్ తోనే ఇబ్బంది పడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి- మెహర్ రమేష్ కాంబోలో తెరకెక్కిన భోళా శంకర్ పరాజయం పాలవ్వడంతో నిర్మాత అనిల్ సుంకర పై కొన్ని రూమర్స్ పుట్టుకొచ్చాయి. చిరు రెమ్యూనిరేషన్ విషయంలో ఒత్తిడి చేయడం వలన అనిల్ సుంకర ఇల్లు తాకట్టు పెట్టాడని, అందుకే తోటలను కూడా విక్రయించాల్సి వచ్చిందని అనిల్ చెప్పినట్లు రూమర్స్ వచ్చాయి. అయితే ఈ వార్తలను అనిల్ సుంకర, చిత్ర బృందం ఖండించింది. ఇందులో ఎలాంటి నిజం లేదని తోసిపుచ్చింది. ఇక తాజాగా మరోసారి అనిల్ సుంకర ఈ వివాదంపై స్పందించారు. ఇందులో ఎలాంటి నిజం లేదని ట్వీట్ ద్వారా తెలిపారు. ఇది క్రూరమైనవాళ్లు చేసిన పని అని..అలాంటి చెత్త మాటలను నమ్మకండని తెలిపారు.
Daggubati Abhiram: దగ్గుబాటి ఇంట పెళ్లి సందడి.. ?
Also Read
“సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ కొంతమంది క్రూరమైన వారికి వినోదం కావొచ్చు. కానీ, ఎన్నో ఏళ్లుగా కష్టపడి నిర్మించుకున్న ప్రతిష్టను దెబ్బతీయడం అనేది ఆమోదయోగ్యం కాని నేరం. దీనివలన అన్ని కుటుంబాలకు విపరీతమైన ఒత్తిడి మరియు ఆందోళనను కలిగిస్తుంది. నాకు, చిరంజీవిగారికి మధ్య జరిగిన వివాదం గురించి వస్తున్నా వార్తలు అన్ని చెత్త. చిరు.. నాకు అన్ని విషయాల్లో సపోర్ట్ గా నిలిచారు. మొదటి నుంచి కూడా చిరుతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. దయచేసి నిజాలను కప్పిపెట్టి.. అబద్దాలను వ్యాప్తి చేయకండి. ఫేక్ న్యూస్ సృష్టించడం కొందరికి సరదాగా ఉండొచ్చు. కానీ, అందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ చిక్కుల్లో పడాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో నాకు అండగా నిలిచిన ఇండస్ట్రీ మిత్రులు, శ్రేయోభిలాషులకు నా ధన్యవాదాలు. మీ అందరి ఆశీస్సులతో మరింత బలంగా తిరిగి మీ ముందుకు వస్తాం” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!