NTV Telugu Site icon

Anil Sunkara: చిరంజీవితో వివాదం.. అదంతా చెత్త అన్న నిర్మాత

Chiru

Chiru

Anil Sunkara: సినిమా రంగంలో ప్రశంసలు మాత్రం కాదు విమర్శలు కూడా ఉంటాయి. సినిమా హిట్ అయితే పొగిడిన నోరే.. ప్లాప్ అయితే తిట్టిపోస్తుంది. ఇక ఈ మధ్యకాలంలో సినిమా ప్లాప్ అయితే నిర్మాతకు హీరోకు మధ్య విబేధాలు ఉన్నాయని పుకార్లు సృష్టించేస్తున్నారు. హీరో వలనే నిర్మాత నష్టపోయినట్లు.. అది వారే అన్నట్లు ఫేక్ న్యూస్ ను సృష్టించి నెట్టింట వైరల్ గా మారుస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి నిర్మాత అనిల్ సుంకర ఇలాంటి ఫేక్ న్యూస్ తోనే ఇబ్బంది పడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి- మెహర్ రమేష్ కాంబోలో తెరకెక్కిన భోళా శంకర్ పరాజయం పాలవ్వడంతో నిర్మాత అనిల్ సుంకర పై కొన్ని రూమర్స్ పుట్టుకొచ్చాయి. చిరు రెమ్యూనిరేషన్ విషయంలో ఒత్తిడి చేయడం వలన అనిల్ సుంకర ఇల్లు తాకట్టు పెట్టాడని, అందుకే తోటలను కూడా విక్రయించాల్సి వచ్చిందని అనిల్ చెప్పినట్లు రూమర్స్ వచ్చాయి. అయితే ఈ వార్తలను అనిల్ సుంకర, చిత్ర బృందం ఖండించింది. ఇందులో ఎలాంటి నిజం లేదని తోసిపుచ్చింది. ఇక తాజాగా మరోసారి అనిల్ సుంకర ఈ వివాదంపై స్పందించారు. ఇందులో ఎలాంటి నిజం లేదని ట్వీట్ ద్వారా తెలిపారు. ఇది క్రూరమైనవాళ్లు చేసిన పని అని..అలాంటి చెత్త మాటలను నమ్మకండని తెలిపారు.

Daggubati Abhiram: దగ్గుబాటి ఇంట పెళ్లి సందడి.. ?

“సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ కొంతమంది క్రూరమైన వారికి వినోదం కావొచ్చు. కానీ, ఎన్నో ఏళ్లుగా కష్టపడి నిర్మించుకున్న ప్రతిష్టను దెబ్బతీయడం అనేది ఆమోదయోగ్యం కాని నేరం. దీనివలన అన్ని కుటుంబాలకు విపరీతమైన ఒత్తిడి మరియు ఆందోళనను కలిగిస్తుంది. నాకు, చిరంజీవిగారికి మధ్య జరిగిన వివాదం గురించి వస్తున్నా వార్తలు అన్ని చెత్త. చిరు.. నాకు అన్ని విషయాల్లో సపోర్ట్ గా నిలిచారు. మొదటి నుంచి కూడా చిరుతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. దయచేసి నిజాలను కప్పిపెట్టి.. అబద్దాలను వ్యాప్తి చేయకండి. ఫేక్‌ న్యూస్‌ సృష్టించడం కొందరికి సరదాగా ఉండొచ్చు. కానీ, అందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ చిక్కుల్లో పడాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో నాకు అండగా నిలిచిన ఇండస్ట్రీ మిత్రులు, శ్రేయోభిలాషులకు నా ధన్యవాదాలు. మీ అందరి ఆశీస్సులతో మరింత బలంగా తిరిగి మీ ముందుకు వస్తాం” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.