Anil Sunkara : మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేశ్ డైరెక్షన్ లో వచ్చిన భోళాశంకర్ డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీ టైమ్ లో నిర్మాత అనిల్ సుంకర ఆస్తులు అమ్ముకుని చిరంజీవికి రెమ్యునరేషన్ ఇవ్వాల్సి వచ్చిందంటూ రకరకాల రూమర్లు క్రియేట్ అయ్యాయి. అనిల్ సుంకర తాజాగా ఎన్టీవీతో చేసిన పాడ్ కాస్ట్ లో వాటిపై క్లారిటీ ఇచ్చారు. మూవీ ప్లాప్ కావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. హిందీ వేదాలంను రీమేక్ చేయాలని ముందు అనుకున్నాం. కానీ మెహర్ రమేశ్ దగ్గర తమిళ రీమేక్ మూవీ రైట్స్ ఉన్నాయని చెప్పడంతో పాటు.. చిరంజీవి గారు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడంతో.. నాకు కూడా నమ్మకం కలిగి చేశాను.
Read Also : Anil Sunkara : 1 నేనొక్కడినే ప్లాప్ అవుతుందని ముందే తెలుసు..
మూవీ రిలీజ్ అయిన రోజు అంతటా డిజాస్టర్ టాక్ నడుస్తోంది. ఆ టైమ్ లో రకరకాల రూమర్లు క్రియేట్ చేశారు. చిరంజీవికి రెమ్యునరేషన్ ఇవ్వడం కోసం అనిల్ సుంకర రాజుగారి తోట అమ్మేశారు అంటూ ప్రచారం చేశారు. కానీ చిరంజీవి గారు నాకు ఫోన్ చేసి ‘డబ్బుల గురించి మర్చిపో.. అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం అని భరోసా ఇచ్చారు. ఆయన చాలా సపోర్ట్ చేశారు కాబట్టే దాని నుంచి బయటపడ్డాం. లేదంటే అంత ఈజీ అయ్యేది కాదు. కానీ చిరంజీవి గారిని బ్లేమ్ చేయడానికి నేను ఆస్తులు అమ్ముకున్నాను అంటూ తప్పుగా ప్రచారం చేశారు. ఆ మూవీ తర్వాత కూడా నన్ను కథలు రెడీ చేసుకో మనం మూవీ చేద్దాం అని హామీ ఇచ్చారు. ఆయన వల్ల ఎవరు ఇబ్బంది పడ్డా ఆయన భరించలేరు అని చెప్పుకొచ్చారు అనిల్ సుంకర.
Read Also : Prabhas : మంచు ఫ్యామిలీకి అండగా ప్రభాస్.. గొప్పోనివయ్యా..
