Lucky Lakshman: సోహైల్ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ ఫేమ్ సోహైల్, మోక్ష జంటగా ఎ. ఆర్. అభి దర్శకత్వంలో హరిత గోగినేని నిర్మిస్తున్న చిత్రం ‘లక్కీ లక్ష్మణ్’. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సందర్భంగా మూవీ ఫస్ట్ లుక్ ను బుధవారం ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ”ఫస్ట్ లుక్ చాలా బాగుంది. దర్శక, నిర్మాతలకు ఇది మొదటి చిత్రమైనా చాలా చక్కగా తెరకెక్కించారు. వీరిద్దరికీ ఈ మూవీ మంచి పేరు తీసుకురావాలి. నటుడు సోహైల్ నాకు బిగ్ బాస్ నుండి తెలుసు. తను నటన బాగుంటుంది. వీరి ముగ్గురు కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను” అని అన్నారు. సోహైల్ మాట్లాడుతూ, ”అనిల్ రావిపూడి అన్న ఎంతో బిజీగా ఉన్నా మా మూవీ ఫస్ట్ లుక్ ను లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మా దర్శక, నిర్మాతలకు సినిమాపై ఎంత ప్యాషన్ ఉందో సినిమా కథలను సెలెక్ట్ చేసుకోవడంలో కూడా అంతే అభిరుచిని ఉంది. ఈ సినిమాను టెక్నికల్ పరంగా, ఔట్ ఫుట్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సీనియర్ టెక్నీషియన్స్ తో నిర్మించారు. ఈ చిత్రం అందరికీ తప్పకుండా నచ్చుతుంది” అని చెప్పారు. అన్నారు. తమ జనరేషన్ కు అనిల్ రావిపూడి ఓ గొప్ప ఇన్ స్పిరేషన్ అని దర్శకుడు ఎ.ఆర్. అభి అన్నారు.
Also Read

చిత్ర నిర్మాత హరిత గోగినేని మాట్లాడుతూ, ”మా మూవీ మోషన్ పోస్టర్ ను చూసిన చాలా మంది క్రియేటివ్ గా ఉందని అభినందించారు. ప్రేక్షకులకు ఒక మంచి కాఫీ లాంటి సినిమాను ఇస్తారనే కామెంట్స్ రావడంతో మాకది ఎంతో ఎనర్జీని ఇచ్చినట్లు అయ్యింది” అని చెప్పారు. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను అందిస్తామని ఆమె అన్నారు.
తాజావార్తలు
-
The Paradise Teaser: నాని మాస్ విశ్వరూపం.. ‘ది ప్యారడైజ్’తో బాక్సాఫీస్ బద్దలేనా!
-
Shubhman Gill: మైదానంలో విలవిలలాడిన గిల్.. నెట్స్‌లో ఊహించని ప్రమాదం.. అభిమానుల్లో పెరిగిన ఆందోళన..
-
UK: ఆర్మీ కాలేజీలో మహిళలపై అత్యాచారాలు.. యూకేను కుదిపేస్తున్న ఘటన..
-
Rahul Gandhi: రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు ఫోన్.. ఏం సంభాషణ జరిగిందంటే..!
-
Minister Anitha: జగన్ బయటకు వస్తే విధ్వంసమే.. పరామర్శల పేరుతో అరాచకం.. మంత్రి అనిత ఘాటు వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!