మెగాస్టార్ చిరంజీవి ఏ ప్రాజెక్ట్‌కైనా సైన్ చేస్తే ఆ సినిమా మీద అంచనాలు ఆకాశాన్ని తాకడం సహజం. ఇప్పుడు అలాంటి అంచనాలతో ముందుకు వస్తున్న ప్రాజెక్టు ‘మన శంకర వరప్రసాద్ గారు’. ఈ టైటిల్ విన్నప్పటినుంచే అభిమానుల్లో ప్రత్యేకమైన ఎగ్జైట్మెంట్ మొదలైంది. ఎందుకంటే ఈ టైటిల్‌లోనే క్లాసిక్ టచ్,పాజిటివ్ వైబ్స్ అన్ని కలిసివచ్చాయి.ఈ భారీ ప్రాజెక్ట్‌కు డైరెక్టర్‌గా ఉన్నది హిట్ మెషిన్ అనిల్ రావిపూడి. గత కొన్నేళ్లలో వరుస విజయాలతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనిల్, ఎంటర్‌టైనర్‌లలో నంబర్ వన్ డైరెక్టర్‌గా పేరు సంపాదించాడు. ఆయన చిత్రాలలో కామెడీ, ఎమోషన్, యాక్షన్ మిక్స్ ఎప్పుడూ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు మెగాస్టార్‌తో ఆయన కాంబినేషన్ రావడంతో ఈ మూవీపై హైప్ మరింత పెరిగింది.
Also Read : AA22×A6 : అల్లు అర్జున్ – అట్లీ కాంబో హాలీవుడ్ టచ్‌తో భారీ ప్లాన్!
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం అనిల్ కేవలం డైరెక్టర్‌గా మాత్రమే కాకుండా డబుల్ డ్యూటీ చేస్తున్నాడట. షూటింగ్‌లో ఒక్క రోజైనా డిలే లేకుండా, ప్రణాళికాబద్ధంగా సినిమా ముందుకు తీసుకెళ్తున్నాడు. ప్రీ-ప్రొడక్షన్ నుంచి షూటింగ్ వరకు ప్రతిదీ పర్ఫెక్ట్ షెడ్యూల్‌లో సాగుతున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌లో ఆయన టైమ్ మేనేజ్‌మెంట్ ఒక లెవెల్ అని అంటున్నారు. అంతే కాదు ప్రస్తుతం తెలుగు సినిమాల్లో బడ్జెట్ కంట్రోల్ పెద్ద సవాలుగా మారింది. కానీ అనిల్ రావిపూడి ఈ విషయంలో నిర్మాతలకు బంగారు బట్టలుగా మారుతున్నాడు. నటీనటుల రెమ్యునరేషన్, టెక్నికల్ ఖర్చులు, ప్రొడక్షన్ బడ్జెట్ – అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ, క్వాలిటీలో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా ముందుకు తీసుకెళ్తున్నారు. అంటే, డైరెక్టర్‌గా తన క్రియేటివ్ విజన్ చూపించడం మాత్రమే కాకుండా, నిర్మాతలకు సేఫ్టీ ఇవ్వడంలో కూడా తనదైన స్ట్రాటజీతో దూసుకెళ్తున్నాడు. ఇలా పక్కా ప్లానింగ్‌తో, ఖర్చులో జాగ్రత్తతో సినిమా తీస్తున్న అనిల్ రావిపూడి ప్రయత్నం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఇక అనిల్ రావిపూడి పర్ఫెక్ట్ ప్రణాళిక, క్రియేటివ్ విజన్‌తో ఈ ప్రాజెక్ట్‌ని ఎలా నెక్స్ట్ లెవెల్‌లోకి తీసుకెళ్తాడో చూడాలి.