మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘మన శంకర్ వరప్రసాద్ గారు’, జనవరి 12వ తేదీన సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి ఆట నుంచే సినిమాకి పాజిటివ్ టాక్ లభించడంతో సూపర్ కలెక్షన్స్ నమోదు అవుతున్నాయి. అయితే ఈ సినిమాలో నయనతారను హీరోయిన్‌గా ఎంపిక చేయడం ఒక ఎత్తు అయితే, అసలు ప్రమోషన్స్ అంటే ఆమడ దూరం పరిగెత్తే ఆమెతో ప్రమోషన్స్ చేయించడం మరో ఎత్తు.
Also Read:Chiranjeevi: పొట్ట కోటి కోసం పొట్ట మాడ్చుకున్నా
”ఇది ఎలా కుదిరింది?” అంటూ మెగాస్టార్ చిరంజీవి తాజాగా రిలీజ్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడిని ప్రశ్నించారు. దీనికి అనిల్ రావిపూడి స్పందిస్తూ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. నిజానికి చిరంజీవి స్థాయి హీరోకి.. అంతే పొగరుగా, ధీటుగా నిలబడే హీరోయిన్ ఎవరా అని వెతుకుతుంటే తనకు ఆమె కనిపించిందని, అలాంటి పాత్రకు ఆమెను కాకుండా వేరే హీరోయిన్‌ని పెడితే అది మొదటికే మోసం వచ్చే అవకాశం ఉందని చెప్పుకొచ్చాడు.
Also Read:Trivikram Srinivas: తండ్రిని కాదని ఆ డైరెక్టర్ వద్ద చేరిన త్రివిక్రమ్ కొడుకు..
ఆమెను ఈ సినిమాలో నటింపజేయాలని కోరగానే.. సాహు గారపాటితో పాటు సుస్మిత కూడా రంగంలోకి దిగి నయనతారతో మాట్లాడించారని అన్నారు. కథ మొత్తం విన్న తర్వాత.. “నాకు కథ నచ్చింది, చిరంజీవి గారితో సినిమా చేయాలి, అందులో వెంకటేష్ గారు కూడా ఉన్నారు. కానీ కొన్ని టెక్నికల్టీస్ కుదరడం లేదు, ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? ఒకవేళ నేను సినిమా చేయను అని చెబితే నువ్వేం చేస్తావు?” అని నయనతార నన్ను అడిగారు. వెంటనే నేను.. “మీరు వెంకటేష్ గారి ‘దృశ్యం’ సినిమా చూశారు కదా.. అందులో అనుకున్నట్టుగానే, నేను ఈరోజు నయనతార గారికి ఫోన్ చేయలేదు, ఆమెకు కథ చెప్పలేదు అని భావించి పడుకుంటాను” అని చెప్పుకొచ్చాను. వెంటనే ఆమె కాసేపు నవ్వేసి.. “మనం ఈ సినిమా చేస్తున్నాం, ఆ టెక్నికల్టీస్ ఎలా క్లియర్ చేసుకుంటావో చేసుకో” అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆయన అన్నారు. కథ నచ్చడంతోనే ప్రమోషన్స్‌కు ఇలా చేద్దాం అనగానే ఆమె సహకరించారని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు.
