NTV Telugu Site icon

Balakrishana : బాలయ్య సినిమా కోసం అదిరిపోయే టైటిల్ ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి

Download

Download

బాలయ్య ప్రస్తుతం అనీల్ రావిపూడి తో బిగ్ యాక్షన్‌ డ్రామా తో ఓ సినిమా ను చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్‌ దాదాపుగా చివరి దశకు అయితే వచ్చేసింది.అఖండ మరియు వీరసింహా రెడ్డి వంటి వరుస భారీ విజయాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో అందరి చూపు కూడా ఈ సినిమాపైనే ఉంది.దానికి తోడు బాలయ్య లుక్స్‌ కూడా సినిమా పై అంచనాల ను భారీగా పెంచేశాయి. దసరాను టార్గెట్‌ చేసుకుని ఈ సినిమా శరవేగంగా షూటింగ్‌ ను పూర్తి చేసుకుంటుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త మాత్రం నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. ఈ సినిమాకు భగవత్‌ కేసరి అనే టైటిల్‌ ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఐ డోంట్‌ కేర్‌ అనేది ఒక ఉపశీర్షిక. ఇప్పటికే ఈ పేరును చిత్రబృందం రిజిస్టర్‌ చేయించినట్లు కూడా తెలుస్తుంది. బాలయ్య బర్త్‌డే సందర్భంగా జూన్‌ 10న టైటిల్‌ను రివీల్ చేయనున్నారని సమాచారం.ఇక అనీల్‌ రావిపూడి తొలిసారి అవుట్‌ అండ్ యాక్షన్‌ సినిమాను చేస్తున్నాడని తెలుస్తుంది.శ్రీలీల ఈ సినిమాలో బాలయ్య కూతురుగా కనిపించబోతుంది.. తండ్రి కూతురు సెంటిమెంట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.థమన్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడని తెలుస్తుంది.

Show comments