NTV Telugu Site icon

Sarkaru Vaari Paata: మహేష్ బాబుకు జగన్‌ సర్కార్ తీపి క‌బురు

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు, అందాల భామ కీర్తి సురేష్ జంటగా నటించిన స‌ర్కారువారి పాట సినిమాకు సంబంధించి టికెట్ల రేట్ల పెంపున‌కు ఏపీ ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌న్ ఇచ్చింది. ఈ నెల 12న విడుద‌ల కానున్న ఈ చిత్రానికి సంబంధించి 10 రోజుల పాటు టికెట్లపై రూ.45 మేర‌ పెంచుకోవ‌చ్చంటూ ఏపీ ప్ర‌భుత్వం అనుమ‌తులు ఇచ్చింది. ఈ మేర‌కు శుక్ర‌వారం రాత్రి ఏపీ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

దీంతో ఏపీలో రాధే శ్యామ్, ఆర్.ఆర్.ఆర్, ఆచార్య సినిమాల తరహాలో సర్కారు వారి పాట సినిమాకు కూడా థియేటర్ యాజమాన్యాలు టిక్కెట్ రేట్లు పెంచనున్నాయి. గతంలో జగన్ దగ్గరకు వెళ్లి సినిమా టిక్కెట్ రేట్లు పెంచాలని అభ్యర్థించడంతో ఆయా హీరోలు నటించిన సినిమాలకు ప్రభుత్వం టిక్కెట్ రేట్లు పెంచుకోవచ్చని అనుమతులు ఇస్తోంది. ఈ క్ర‌మంలోనే స‌ర్కారువారి పాట సినిమా యూనిట్ కూడా ఏపీ ప్ర‌భుత్వాన్ని టికెట్ల రేట్ల పెంపున‌కు అభ్య‌ర్థించింది. ఈ అభ్య‌ర్థ‌న‌ను ప‌రిశీలించిన ఏపీ స‌ర్కారు… స‌ర్కారువారి పాట సినిమా టికెట్ల రేట్ల పెంపున‌కు అనుమ‌తి మంజూరు చేసింది. దీంతో సర్కారు వారి పాట చిత్ర యూనిట్ ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇక సర్కారు వారి పాట విషయానికి వస్తే.. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించగా.. నదియా, సముద్ర ఖని, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇక ఈ చిత్రాన్ని జీఏంబీ ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు.