Site icon NTV Telugu

‘అందరూ బాగుండాలి…’ అందరూ చూడొచ్చు!

నరేశ్, ఆలీతో పాటు మెట్రోట్రైన్‌ ముఖ్యభూమిక పోషించిన చిత్రం ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’. గతేడాది నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై సంచలన విజయంగా నమోదైన మలయాళ చిత్రం ‘వికృతి’కి ఇది రీమేక్. సోషల్‌ మీడియాలో అత్యుత్సాహం ప్రదర్శించే కొందరివల్ల అమాయకులకు ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది అనే కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. అలీవుడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఆలీ సమర్పణలో శ్రీపురం కిరణ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అలీబాబా, కొణతాల మోహన్, శ్రీచరణ్‌ సంయుక్తంగా నిర్మించారు.

సంగీత దర్శకుడు ఏ. ఆర్‌. రెహమాన్‌ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన రాకేశ్‌ పళిదంను ఈ సినిమా ద్వారా సంగీత దర్శకునిగా పరిచయం చేస్తున్నారు. ఈ చిత్రం సెన్సార్‌ పూర్తయిన సందర్భంగా నటుడు, చిత్ర నిర్మాత ఆలీ మాట్లాడుతూ, ”మా సినిమాకు క్లీన్‌ యు సర్టిఫికెట్‌ లభిండం ఆనందంగా ఉంది. సినిమా చూసిన ఐదుగురు సభ్యుల బృందం… నాతోపాటు మా టీమ్‌తో మాట్లాడుతూ చాలాకాలం తర్వాత ఒక మంచి సినిమాని చూశాం అని ప్రశంసిస్తుంటే మేము పడిన కష్టం అంతా ఒక్కసారిగా ఎగిరిపోయింది. నేను ఏ పనిచేసినా ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేస్తాను. సెన్సార్‌ వారి ప్రశంసల తర్వాత ఈ సినిమా చేసే విషయంలో నా డెసిషన్‌ కరెక్టే అని అర్థమయింది. త్వరలోనే సినిమా ట్రైలర్‌ను టాలీవుడ్‌లోని ఓ ప్రముఖ హీరోతో విడుదల చేయిస్తాం. అక్కడే సినిమా విడుదల తేదీని కూడా ప్రకటిస్తాను” అన్నారు.

Exit mobile version