NTV Telugu Site icon

Anchor Suma: ఆ షోలో సుమను ఒక ఆట ఆడుకున్న బ్రహ్మాజీ..

Suma

Suma

Anchor Suma: యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె నోరు తెరిస్తే అస్సలు ఆపడానికి ఉండదు. ఎదురుగా ఉన్నది ఎంత పెద్ద స్టార్ అయినా కూడా ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది. ఇక ఇంటర్వ్యూలు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో ఆమె మాటకారితనంతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. ఇక అలాంటి సమయంలో ఒక్కోసారి మాటలను వదిలేస్తూ ఉంటుంది. దాని వలన కొన్నిసార్లు కొన్ని వివాదాలను ఎదుర్కొంటూ ఉంటుంది. ఇక ఈ మధ్యనే ఒక ప్రెస్ మీట్ లో రిపోర్టర్లను స్నాక్స్ ను భోజనాలు చేసినట్లు చేస్తున్నారు. త్వరగా వస్తే ప్రెస్ మీట్ స్టార్ట్ చేయొచ్చు అని సరదాగా చెప్పుకొచ్చింది. అయితే దానికి జర్నలిస్ట్ లు హర్ట్ అయ్యి..ఇలాంటి మాటలు తగ్గించుకుంటే మంచిది అని చెప్పుకొచ్చారు. ఇక దీంతో సుమ .. వారికి క్షమాపణలు చెప్పుకొచ్చింది. అక్కడితో ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. ఇక తాజగా సుమ అడ్డా షోలో ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ టీమ్ సందడి చేసింది.

నితిన్, డైరెక్టర్ వక్కంతం వంశీ, హైపర్ ఆది, బ్రహ్మాజీ ఈ షోలో పాల్గొన్నారు. ఇక బ్రహ్మజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ నావబువులు పూస్తాయి. ఇక సోషల్ మీడియాను బ్రహ్మాజీ చాలా బాగా ఫాలో అవుతూ ఉంటాడు. ఆదిపురుష్ ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్.. డైరెక్టర్ ఓం రౌత్ ను కమ్ టూ మై రూమ్ అని కోపం గా అన్నాడు. ఇక ఆ తరువాత అది ఎంత ట్రోల్ అయ్యిందో అందరికి తెల్సిందే. ఇక ఆ మాటను పట్టుకొని బ్రహ్మాజీ.. సుమ షోలో సందడి చేశాడు. ఇక ఇప్పుడు.. సుమ అన్న మాటను.. మరోసారి స్పూఫ్ చేసి ఆకట్టుకున్నాడు. ప్రతిసారి సుమను భోజనాలు పెడుతున్నారా.. ? స్నాక్స్ తింటున్నా భోజనాలు కాదు అని సుమను ఓ రేంజ్ లో ఆడుకున్నాడు. ఇక ఈ ప్రోమోపై నితిన్ సూపర్ ఫన్ అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.