Anchor Suma: కన్నీళ్లు పెట్టుకున్న సుమ.. యాంకరింగ్‌కు బ్రేక్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anchor Suma: యాంకర్ సుమ అంటే తెలియనివారే ఉండరు. 15 ఏళ్లుగా టాప్ యాంకర్‌గా సుమ తన హవా కొనసాగిస్తోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఆమెకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఓ పక్క బుల్లితెరపై రాణిస్తూనే వివిధ ప్రీ రిలీజ్ ఈవెంట్లకు యాంకర్‌గా చేస్తున్న సుమ వెండితెరపైనా తనదైన రీతిలో నటిస్తోంది. జయమ్మ పంచాయతీ సినిమాతో తనలోని మరో కోణాన్ని అభిమానులకు చాటుకుంది. చాలా మంది స్టార్ హీరోలు తమ సినిమా ఫంక్షన్లకు సుమ యాంకరింగ్ చేయాలని పట్టుబడుతుంటారు. అంతటి టాలెంట్, టైమింగ్ సుమకు మాత్రమే సొంతం.
Read Also: Unstoppable 2: బాలయ్య-పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ షూటింగ్ షురూ…
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
తాజాగా ఓ షోలో తాను యాంకరింగ్‌కు బ్రేక్ ఇస్తున్నట్లు చెప్పి సుమ అందర్నీ షాక్‌కు గురిచేసింది. ఈటీవీలో న్యూ ఇయర్ సందర్భంగా ప్రసారం కానున్న షోలో పాల్గొన్న సుమ ఈ ప్రకటన చేసింది. తాను మలయాళీని అయినా తెలుగు ప్రేక్షకులు గుండెల్లో పెట్టుకుని ప్రేమించారని సుమ ఎమోషనల్ అయ్యింది. అనంతరం ఆమె కన్నీటి పర్యంతమైంది. ప్రస్తుతానికి తాను కొంత విరామం తీసుకుంటున్నట్లు సుమ తెలిపింది. దీంతో మిగిలిన ఆర్టిస్టులంతా సుమకు శాలువా కప్పి సన్మానం చేశారు. ఈ మేరకు ఓ ప్రోమోను ఛానల్ నిర్వాహకులు విడుదల చేయగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ ప్రోమోను చూసిన కొందరు డిసెంబర్ 31న యాంకరింగ్‌కు బ్రేక్ ఇచ్చిన సుమ కొత్త ఏడాదిలో అంటే జనవరి 1 నుంచి యాంకర్‌గా కొనసాగుతుందని నెటిజన్లు కౌంటర్లు పోస్ట్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!