Site icon NTV Telugu

Anchor Suma: కన్నీళ్లు పెట్టుకున్న సుమ.. యాంకరింగ్‌కు బ్రేక్..?

Anchor Suma

Anchor Suma

Anchor Suma: యాంకర్ సుమ అంటే తెలియనివారే ఉండరు. 15 ఏళ్లుగా టాప్ యాంకర్‌గా సుమ తన హవా కొనసాగిస్తోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఆమెకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఓ పక్క బుల్లితెరపై రాణిస్తూనే వివిధ ప్రీ రిలీజ్ ఈవెంట్లకు యాంకర్‌గా చేస్తున్న సుమ వెండితెరపైనా తనదైన రీతిలో నటిస్తోంది. జయమ్మ పంచాయతీ సినిమాతో తనలోని మరో కోణాన్ని అభిమానులకు చాటుకుంది. చాలా మంది స్టార్ హీరోలు తమ సినిమా ఫంక్షన్‌లకు సుమ యాంకరింగ్ చేయాలని పట్టుబడుతుంటారు. అంతటి టాలెంట్, టైమింగ్ సుమకు మాత్రమే సొంతం.

Read Also: Unstoppable 2: బాలయ్య-పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ షూటింగ్ షురూ…

తాజాగా ఓ షోలో తాను యాంకరింగ్‌కు బ్రేక్ ఇస్తున్నట్లు చెప్పి సుమ అందర్నీ షాక్‌కు గురిచేసింది. ఈటీవీలో న్యూ ఇయర్ సందర్భంగా ప్రసారం కానున్న షోలో పాల్గొన్న సుమ ఈ ప్రకటన చేసింది. తాను మలయాళీని అయినా తెలుగు ప్రేక్షకులు గుండెల్లో పెట్టుకుని ప్రేమించారని సుమ ఎమోషనల్ అయ్యింది. అనంతరం ఆమె కన్నీటి పర్యంతమైంది. ప్రస్తుతానికి తాను కొంత విరామం తీసుకుంటున్నట్లు సుమ తెలిపింది. దీంతో మిగిలిన ఆర్టిస్టులంతా సుమకు శాలువా కప్పి సన్మానం చేశారు. ఈ మేరకు ఓ ప్రోమోను ఛానల్ నిర్వాహకులు విడుదల చేయగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ ప్రోమోను చూసిన కొందరు డిసెంబర్ 31న యాంకరింగ్‌కు బ్రేక్ ఇచ్చిన సుమ కొత్త ఏడాదిలో అంటే జనవరి 1 నుంచి యాంకర్‌గా కొనసాగుతుందని నెటిజన్‌లు కౌంటర్లు పోస్ట్ చేస్తున్నారు.

Exit mobile version