NTV Telugu Site icon

Anchor Suma: ఆమెకు ఉద్యోగం.. గుండెంతా ఆనందంతో నిండిపోయిందంటున్న యాంకర్ సుమ

Anchor Suma

Anchor Suma

Anchor Suma Congratulates and Thanks Revanth Reddy Anumula: తెలంగాణలోని నాంపల్లికి చెందిన దివ్యాంగురాలు ముఖ్యమంత్రిగా రజినీకి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానం పంపడం హాట్ టాపిక్ అయింది. కొద్దీ రోజుల కిందట నాంపల్లికి చెందిన వికలాంగురాలు రజినీ అనే యువతి గాంధీభవన్‌లో టీపీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిసి తాను పీజీ పూర్తి చేశానని అయితే ఎత్తు సమస్య వలన ఉద్యోగం రాలేదని, ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉద్యోగం ఇవ్వడం లేదని ఆవేదనను వ్యక్తం చేసింది. దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. డిసెంబర్ 9వ తేదీన ఎల్బీ స్టేడియంలో జరిగే కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఆమెను కోరారు, ప్రభుత్వం ఏర్పాటు కాగానే తన అర్హతలకు తగ్గ ఉద్యోగం ఇస్తామని హామీ ఇవ్వగా అన్నట్టుగానే ఆమెకు 50వేల జీతంతో కాంట్రాక్ట్ ఉద్యోగం ఇచ్చారు.

Devil: ‘డెవిల్’ సినిమా కోసం 90 కాస్ట్యూమ్స్‌ను ఉప‌యోగించిన కళ్యాణ్ రామ్

ఇక ఈ విషయం మీద స్పందించిన యాంకర్ సుమ ఒక డిఫరెంట్లీ ఏబుల్డ్ వ్యక్తికి ఉద్యోగం ఇచ్చారని విని నా హృదయం ఆనందంతో నిండిపోయింది, తెలంగాణలో బస్ డ్రైవర్ పోస్టుల కోసం ట్రాన్స్‌జెండర్లు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిసి ఇంకా ఆనందం కలుగుతోంది. కేవలం ఒక వారం క్రితం నేను పద్మావతి వికలాంగ సమాజానికి సమాన అవకాశాల గురించి మాట్లాడాము అని ట్వీట్ చేసింది. అంతేకాక సునీతా కృష్ణన్ ‘ప్రజ్వల’తో ట్రాన్స్‌జెండర్ల గురించి కూడా మాట్లాడాము. మీరు వాగ్దానం చేసినట్లుగా ఇంత గొప్ప చొరవ తీసుకుని, తూమరి రజినీకి ఉద్యోగం అందించినందుకు మరియు ఇతర విషయాలకు ధన్యవాదాలు సీఎం రేవంత్ అనుముల గారు అని ఆమె రాసుకొచ్చారు. ఇక ట్రాన్స్‌జెండర్లకు సపోర్ట్ చేస్తున్నందుకు థాంక్స్ అని పమేలా సత్పతీ అనే ఐఏఎస్ కి కూడా ఆమె థాంక్స్ చెప్పింది.

Show comments