Biggboss: యాంకర్ రవి రేంజ్ ఇప్పుడు పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా ‘బిగ్ బాస్’ షోలో పాల్గొన్న తర్వాత అతనికి మంచి గుర్తింపు వస్తోంది. ఇప్పటికే పలు బ్రాండ్స్ ప్రమోషనల్ యాడ్స్ లో నటిస్తున్న రవి కిట్ లో మరో యాడ్ వచ్చి చేరింది. గోకుల్ కోడ్స్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి చైర్మన్ కిషోర్ ఆధ్వర్యంలో వస్తున్నటువంటి 100% ప్యూర్ లెనిన్ క్లాత్స్ బ్రాండ్ ‘లూయిస్ పార్క్’. దీనిని భారత దేశంలోనే మొదటిసారి ఏపీ, తెలంగాణలో లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ బ్రాండ్ నుండి వస్తున్న క్లాత్స్ లలో నూరు శాతం ప్యూర్ లెనిన్ ఉంటుంది.
తాజాగా ఈ బ్రాండ్‌ను ప్రమోట్ చేయడానికి ఒక యాడ్ తయారు చేశారు. ఈ యాడ్ చిత్రీకరణ కోసం హైదరాబాద్‌లో సినిమాను తలదన్నేలా భారీ సెట్స్ వేసి షూట్ చేశారు. ఆ యాడ్ చిత్రీకరణలో ‘జబర్దస్త్’ ఫేమ్ రాకింగ్ రాకేష్, ‘బిగ్ బాస్’ ఫేమ్ యాంకర్ రవి, మోడల్ యశ్వంత్ పాల్గొన్నారు. దీన్ని యాడ్స్ కింగ్ మేకర్ సంజీవ్ డైరెక్ట్ చేశారు. అలాగే ‘జబర్దస్త్’ కి రైటర్ గా చేసినటువంటి సుభాష్ దీనికి కెమెరామెన్‌గా వర్క్ చేయడం విశేషం. త్వరలోనే ఏపీ, తెలంగాణలోని పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ లో ఈ బ్రాండ్‌కు సంబంధించిన బ్రాంచెస్ ఓపెన్ కాబోతున్నాయి.