Site icon NTV Telugu

మీడియాపై యాంకర్ ఝాన్సీ సంచలన వ్యాఖ్యలు

Anchor Jhansi Sensational Comments on Jhansi

సీనియర్ యాంకర్, నటి ఝాన్సీ మీడియాపై షాకింగ్ కామెంట్స్ చేసింది. “అనగనగా ఓ ఎద్దు, దానికో పుండు, ఆ పుండులో పురుగులు… ఎద్దు పుండు కాకికి ముద్దు. కబుర్లు చెప్పాల్సిన కాకులు పొడిచి పొడిచి పురుగులు తిన్నాయి, పండును పెద్దది చేశాయి. ఎద్దు రెచ్చి పోయింది, కాకులు గోల పెంచాయి. మైకులు పెట్టి మరీ మా మురికి గొట్టాలని జనాల ఇళ్లలోకి వదలడం మించి ముఖ్యమైన వార్తలు లేవా? సినిమా ఇంట్లో పెళ్లి అయినా, విడాకులు అయినా, ఎన్నికల అయినా లోకులకు సందడి అనుకుని హడావిడి చేస్తున్న కాకుల్లారా… ప్రజా ప్రయోజనం అంటే ఏంటో డిక్షనరీలో చూడండి” అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

Read Also : మాట్లాడడానికి సమయం ఉంది : మంచు విష్ణు

“ఇది మీరు చూడాలనుకుంటున్నది కాదు. మీకు బలవంతంగా వాళ్ళు చూపించాలనుకున్నదే చూపిస్తున్నారు. మనమందరం వాచ్ డాగ్స్, స్కేప్ గోట్స్… హిప్నోటిక్ కెమెరా లెన్స్ చూసినపుడు ప్రజలు తమ కంట్రోల్ కోల్పోతారు. ఈ నాన్సెన్స్ కు దూరంగా ఉండండి. వార్తలను జాగ్రత్తగా ఎంచుకోండి” అంటూ గట్టిగానే క్లాస్ పీకింది. అయితే ఆమె ఈ కామెంట్ చేయడం వెనుక ఇటీవల కాలంలో ఇండస్ట్రీ లో జరిగిన పలు పరిస్థితులు, పరిణామాలే కారణమని చెప్పకనే చెప్పింది. సమంత విడాకుల నుంచి ఇంకా చర్చలో ఉన్న ‘మా’ ఎన్నికల వరకు మీడియా చూపిన అతి చొరవ ఆమె చేసిన ఈ పోస్టు కు కారణం.

Exit mobile version