RRR promotions : జంజీర్, శక్తి సినిమాలపై యాంకర్ ట్రోలింగ్RRR ప్రమోషన్స్ చురుగ్గా కొనసాగుతున్నాయి. చిత్రబృందం ప్రసిద్ధ యూట్యూబర్ భువన్ బామ్‌తో తమ తాజా ఇంటర్వ్యూను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఫన్నీ ఇంటర్వ్యూలో యూట్యూబర్ భువన్ బామ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లాప్ చిత్రం “శక్తి”, రామ్ చరణ్ నటించిన “జంజీర్” బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడం గురించి అడిగారు. BB Ki Vines YouTube ఛానల్ లో ఈ వీడియోను విడుదల చేశారు. వీరి మధ్య జరిగిన సరదా సంభాషణ ఆసక్తికరంగా ఉంది. భువన్ రామ్, రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య జరిగిన ఈ ఫన్నీ ఇంటర్వ్యూ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.
Read Also : NBK107 : శాండల్ వుడ్ సెన్సేషన్ పవర్ ఫుల్ రోల్ రివీల్
భువన్ బామ్ తన టాక్ షో ‘టిటు టాక్స్’ నుండి RRR బృందంతో ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో పోస్ట్ చేశాడు. మొత్తానికి మరోసారి RRR ప్రమోషన్స్ జోరందుకున్నాయి. RRRకి విజయేంద్ర ప్రసాద్ కథ రాశారు. రాజమౌళి దర్శకత్వం వహించగా, DVV దానయ్య నిర్మించారు. అజయ్ దేవగన్, అలియా భట్, ఒలీవియా మోరిస్, శ్రియా శరణ్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారన్న విషయం.
