Anchor Anasuya: ఆ ఊబిలో చిక్కుకోలేకే.. జబర్దస్త్ నుంచి బయటకొచ్చా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anchor Anasuya Reveals Real Reason Behind Leaving Jabardasth Comedy Show: ప్రముఖ కామెడీ షో ‘జబర్దస్త్’ పుణ్యమా అని యాంకర్ అనసూయకు ఎంతో పాపులారిటీ వచ్చిపడింది. ఈరోజు ఆమె ఇంత స్టార్డమ్‌ని అనుభవిస్తోందంటే.. అది జబర్దస్త్ షో వల్లేనని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. అలాంటి కార్యక్రమానికి ఇప్పుడు అనసూయ గుడ్‌బై చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ షో నుంచి బయటకొచ్చినప్పుడు.. ఇతర షూటింగ్స్ వల్ల డేట్స్ అడ్జస్ట్ చేయలేకే తప్పుకున్నానని అనసూయ చెప్పింది. కానీ, ఆ సమాధానంలో పూర్తి స్పష్టత లేకపోయేసరికి, అనసూయ ఏదో దాస్తోందని, అసలు కారణం అది కాదంటూ ప్రచారం మొదలైంది. ఆ షో నుంచి నాగబాబు, రోజాలతో పాటు ఇతర కీలక కంటెస్టంట్లు తప్పుకోవడం వల్లే.. అనసూయ కూడా బయటకొచ్చిందన్న టాక్ ఊపందుకుంది.
అయితే.. అందులో ఏమాత్రం వాస్తవం లేదని తోసిపుచ్చిన అనసూయ, అసలు కారణం రివీల్ చేసింది. షోలో భాగంగా తనపై వేసే పంచ్‌లు నచ్చడం లేదని ఆమె తెలిపింది. పంచ్‌లు నచ్చక ఎన్నో సందర్భాల్లో ముఖం మాడ్చుకున్నానని, కానీ అవేవీ షోలో కనిపించవని పేర్కొంది. తనకు బాడీ షేమింగ్, వెకిలి చేష్టలు ఏమాత్రం నచ్చవని చెప్పింది. కానీ.. క్రియేటివ్ ఫీల్డ్‌లో అలాంటివి తప్పవని నిట్టూర్చిన అనసూయ, అదే ఊబిలో తాను చిక్కుకుపోవాలని అనుకోవడం లేదని వెల్లడించింది. ఆ షో నుంచి తప్పుకోవడానికి రెండేళ్లుగా అనుకుంటున్నానని, ఇప్పటికీ అది కుదిరిందని స్పష్టతనిచ్చింది. అంతే తప్ప.. నాగబాబు, రోజా వెళ్లిపోయారన్న కారణంతో తాను బయటకు రాలేదని చెప్పింది. తనకు జబర్దస్త్ షో అంటే ఎంతో ఇష్టమని చెప్పిన ఈ యాంకరమ్మ.. తాను నటనపై దృష్టి పెట్టాలని అనుకుంటున్నానని, సినిమాల్లో నటన కారణంగానే జబర్దస్త్‌కు సమయం కుదరడం లేదని చెప్పుకొచ్చింది.
Also Read
- Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా 'ఆదర్శ కుటుంబం'పై ఇంత సైలెన్స్ ఏంటి?
- The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై 'ది ప్యారడైజ్'లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
- Srikanth Odela: "ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?".. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
- Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి 'నో' చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
తాజావార్తలు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!