NTV Telugu Site icon

Anasuya: ఆంటీ వివాదంపై అనసూయ రియాక్షన్.. కోపానికి కారణం అదే!

Anasuya On Aunty Issue

Anasuya On Aunty Issue

Anchor Anasuya Reacts On Aunty Word Controversy: ‘ఆంటీ’.. ఈ పదం వింటే చాలు, యాంకర్ అనసూయకి చిర్రెత్తుకొస్తుంది. తనని ఎవరైనా ఆంటీ అంటే.. ఇక అతనికి బడితపూజే! తనని ఆంటీ అని పిలవడంలో తప్పు లేదు కానీ.. గడ్డాలు, మీసాలు పెంచుకున్న వారు కూడా తనని ఆంటీ అంటే ఒప్పుకోనని అనసూయ చాలాసార్లు క్లారిటీ ఇచ్చింది. తన పిల్లల వయసున్న వారు ఆంటీ అని పిలిస్తే అర్థం ఉందని, కానీ పెళ్లీడుకొచ్చిన అబ్బాయిలు పిలిస్తే మాత్రం సహించేదే లేదంటూ గతంలోనే తేల్చి చెప్పింది. అయినా సరే.. కొందరు నెటిజన్లు కావాలనే అనసూయని టార్గెట్ చేస్తూ, ఆంటీ అని పిలుస్తున్నారు. దీంతో.. వారిలో మార్పు రాదని గుర్తించిన అనసూయ, వారిని పట్టించుకోవడం మానేసింది.

Earthquake: రష్యా తూర్పు తీరంలో భారీ భూకంపం

ఇప్పుడు మరోసారి ఈ ఆంటీ వ్యవహారం తెరమీదకొచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన అభిమానులతో అనసూయ ముచ్చటించగా.. ఈ సందర్భంగా ఒక అభిమాని ‘ఆంటీ’ పిలుపుపై ఒక ప్రశ్న సంధించాడు. ‘అక్కా.. మిమ్మల్ని ఎవరైనా ఆంటీ అంటే ఎందుకంత కోపం?’ అని ప్రశ్నించాడు. ఇందుకు సమాధానం ఇస్తూ.. ‘‘ఆంటీ అంటూ వాళ్లు పిలిచే పిలుపులే అర్థాలు వేరే ఉంటాయి. అందుకే నాకు కోపం వస్తుంది. అయినా.. ఇప్పుడు నాకు కోపం రావట్లేదు. ఎందుకంటే.. వాళ్ల ఖర్మకే వదిలేస్తున్నా. పైగా నాకు చాలా ముఖ్యమైన పనులు ఉన్నాయి. అందుకే.. ఆ చెత్త కామెంట్లను పట్టించుకోవటం మానేశా’’ అంటూ అనసూయ చెప్పుకొచ్చింది. సో.. ఇప్పుడు తనని ఆంటీ అంటూ ఎంత టార్గెట్ చేసినా, తాను పట్టించుకునేదే లేదని స్పష్టం చేసేసింది.

Sleeping in Office: నిద్ర కోసం సెలవు కూడా ఇచ్చిన కంపెనీ

ఇక ఇదే సమయంలో.. తన కొత్త సినిమా సంగతుల్ని కూడా చెప్పుకొచ్చింది. ఏప్రిల్ రెండో వారంలో తన కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది స్పష్టం చేసింది. అలాగే.. తాను పూర్తి శాకాహారినని, మాంసాన్ని అస్సలు ముట్టుకోనని క్లారిటీ ఇచ్చింది. కాగా.. తొలుత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా, అక్కడ పెద్దగా పాపులారిటీ రాకపోవడంతో బుల్లితెరపై అనసూయ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఈ క్రమంలోనే జబర్దస్త్ షోకి యాంకరింగ్ చేసే అవకాశం రాగా, దాన్ని పూర్తిగా సద్వినియోగపరచుకుంది. తన అందంతో పాటు యాంకరింగ్ స్కిల్స్‌తో అదరగొట్టి, అందరి మనసుల్ని దోచుకుంది. అప్పటినుంచే అనసూయకు టీవీ షోలతో పాటు సినిమా ఆఫర్లు కూడా వెతుక్కుంటూ వస్తున్నాయి.

Show comments