Site icon NTV Telugu

Anasuya : మగజాతి పరువు తీస్తున్నారు… నెటిజన్ పై యాంకర్ ఫైర్

Anasuya

Anasuya

బుల్లితెరపై యాంకర్ గా వెండితెరపై నటిగా సత్తా చాటుతున్న టాప్ యాంకర్ అనసూయ భరద్వాజ్. సుకుమార్ “రంగస్థలం”లో అనసూయ నటించిన రంగమ్మత్త పాత్ర ఆమె కెరీర్ ను మలుపు తిప్పింది. అప్పటి నుంచి ఆమె “పుష్ప” వంటి భారీ సినిమాల్లో నటించే అవకాశాన్ని కొట్టేస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే అనసూయ ఎప్పటికప్పుడు తన ఫోటోలు, వీడియోలతో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది. బుల్లితెరపైనే కాకుండా సోషల్ మీడియాలోనూ అనసూయ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఆమెను విమర్శించే వారూ లేకపోలేదు. అనసూయ వేసే డ్రెస్సింగ్ పైన ఎప్పటికప్పుడు ట్రోల్ చేస్తూనే ఉంటారు. కొంతమంది అయితే డైరెక్ట్ గానే ఆమెను ప్రశ్నిస్తూ ఉంటారు. ఆమె కూడా వారికి గట్టిగానే సమాధానం చెప్పి నోరు మూయిస్తుంది. తాజాగా ఎప్పటిలాగే ఓ నెటిజన్ అనసూయ డ్రెస్సింగ్ పై కామెంట్ చేయగా, యాంకర్ ఇచ్చిన ఘాటు రిప్లై వైరల్ అవుతోంది.

Read Also : Trivikram : మాటల మాంత్రికుడికి జరిమానా !

“అనసూయ గారు మీరు ఇద్దరు పిల్లల తల్లి… ఇంకా ఇలాంటి చిట్టిపొట్టి బట్టలు వేసుకుంటారా? తెలుగు ఆడపడుచుల పరువు తీస్తున్నావు ?” అంటూ అడిగేశాడు. దానికి అనసూయ “దయచేసి మీరు మీ పనిని చూసుకోండి… నన్ను నా పనిని చేసుకోనివ్వండి.. మీరు ఇలా ఆలోచించి మగజాతి పరువు తీస్తున్నారు” అంటూ కౌంటర్ ఇచ్చింది. ఇక అనసూయ అభిమానులు ఇప్పుడు పెళ్ళయ్యి ఇద్దరు పిల్లలున్న హీరోలు షాట్స్ వేసుకోవడం, టాప్ లెస్ సీన్స్ వంటివి చేయట్లేదా ? అని ప్రశ్నిస్తున్నారు. మరో నెటిజన్ అసలు ఇలాంటి వాటికి మీరెందుకు రెస్పాండ్ అవుతారు ? టైం, ఎనర్జీ వేస్ట్ అని కామెంట్ చేశాడు. దీనికి స్పందించిన అనసూయ “దీనికి ప్రతిస్పందన అవసరం.. ఎందుకంటే కొద్దిమంది మగవాళ్ళు తమ కుటుంబాల్లో, వారి పని ప్రదేశంలో సాధారణంగా స్త్రీలతో ఎలా ప్రవర్తించాలనే దానిపై అవగాహన కల్పించాలి. వాళ్ళు ఆడవాళ్లను గౌరవించాలి” అంటూ చెప్పుకొచ్చింది.

Exit mobile version