అనసూయ… బుల్లితెరకు గ్లామర్ రంగులు అద్దిన బ్యూటీ. స్మాల్ స్క్రీన్‌పై మసాలా పెంచే విషయంలో హాట్‌నెస్ అంటే ఏమిటో రీ డిఫైన్ చేసింది యాంకర్ అనసూయ భరద్వాజ్ అనే విషయం ఒప్పుకోవాల్సిందే. ఇక ఆ తరువాత వెండి తెరపై కూడా ఆమె తనదైన శైలిలో దూసుకెళ్తోంది. అయితే తాజాగా మాత్రం ఓ సినిమా వల్ల ఆమె చేసిన గ్లామర్ షో అంతా వేస్ట్ అయ్యిందే అంటున్నారు నెటిజన్లు.
Read Also : Project K : తాజా అప్డేట్… సెట్స్ లో ప్రభాస్ సందడి
ఇటీవల విడుదలైన మాస్ రాజా రవితేజ “ఖిలాడీ” సినిమాలో ఈ బ్యూటీ రెండు షేడ్స్ ఉన్న పాత్రను పోషించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఫస్ట్ హాఫ్‌లో అందమైన గృహిణిగా కనిపించగా, సెకండాఫ్‌లో ఆమె గ్లామర్ ట్రీట్ తో అందరికీ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. గతంలో ఎన్నడూ లేనంతగా వెండితెరపై గ్లామర్ ఒలికించేసింది అనసూయ. అయితే ఆ సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో ఆమె ఇంత చేసినా వృధా అయ్యిందనే చెప్పాలి.
ఇక సినిమా టాక్ విషయాన్ని పక్కన పెడితే… సిఎంమాలో హీరోయిన్ల గ్లామర్ ట్రీట్ ఆకట్టుకుంది. తెలుగు బ్యూటీ డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి తన అద్భుతమైన గ్లామర్ ట్రీట్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది. వీరిద్దరితో పోటీగా కాకపోయినా స్టార్ యాంకర్ కూడా బాగానే అందాలు ఆరబోసింది. కానీ అనసూయ వెండితెరపై చేసిన మొట్టమొదటి గ్లామర్ డోస్ మొత్తానికి వృధా అయ్యిందనే చెప్పాలి.
