Site icon NTV Telugu

Anasuya: అమ్మను అన్న ఉసురు ఊరికే పోదు.. ‘లైగర్’ పై అనసూయ అక్కసు

Anasya

Anasya

Anasuya:జబర్దస్త్ హాట్ యాంకర్ అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇక సినిమాలతో తీరిక లేకుండా ఉండడంతో జబర్దస్త్ కూడా మానేసింది. అయితే జబర్దస్త్ నుంచి బయటికి రావడం గురించి ఆమె మాట్లాడుతూ అందులో జరిగే వెకిలి చేష్టలు నచ్చడం లేదని, బాడీ షేమింగ్ చేస్తున్నారని అందుకే ఆ షో నుంచి బయటికి వచ్చేసానని చెప్పుకొచ్చింది. ఇక ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు తమదైన రీతిలో ఏకిపారేస్తున్న విషయం విదితమే. ఇప్పుడిప్పుడే కొంచెం సర్దుమణుగుతున్న వేళ మరోసారి అనసూయ ట్వీట్స్ తో రెచ్చిపోయింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ లైగర్ ప్లాప్ అవ్వడంతో అతడిపై అక్కసును బయటపెట్టింది. అతడికి ఇలాగే జరగాలని చెప్పుకొచ్చింది. ఇన్ డైరెక్ట్ గా ట్వీట్ చేసినా నెటిజన్స్ మాత్రం టక్కున గుర్తుపట్టి ఆమెను ఏకిపారేస్తున్నారు. “అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో కాని రావటం మాత్రం పక్కా!!” అంటూ ట్వీట్ చేసింది.

ఇక కింద ఒకరి దుఃఖానికి సంతోషంగా లేదు కానీ నిజం నిరూపించబడింది అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. అర్జున్ రెడ్డి చిత్రంలో అమ్మను తిట్టినా డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ డైలాగ్ ఎంతోమందికి నచ్చలేదు. తల్లిని తిట్టడమేంటి ఒక హీరో అంటూ ఎంతోమంది ప్రముఖులు సైతం అసహనం వ్యక్తం చేశారు. అందులో అనసూయ కూడా ఉంది. ఇక రౌడీ హీరో వరుస సినిమాలు ప్లాప్ అవుతూ వస్తున్న తరుణంలో ఆ మాట అనడం వలనే అతడికి ఉసురు తగిలి పరాజయం పాలవుతున్నట్లు అనసూయ చెప్పుకొచ్చింది. ఇక ఈ ట్వీట్ పై నెటిజన్లు ఆమెను ఏకిపారేస్తున్నారు. జబర్దస్త్ లో డబుల్ మీనింగ్ డైలాగులు చెప్పే నువ్వు ఇప్పుడు ఇలా నీతులు చెప్తుంటే బాగోలేదని, ఎప్పుడో వచ్చిన సినిమా డైలాగ్ ను పట్టుకొని ఇప్పుడు కర్మ అని తిట్టడం పద్దతి కాదని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version