Site icon NTV Telugu

Anasuya: గాలికిపోయే కంపను మళ్లీ తగిలించుకోవడం అవసరమా ‘ఆంటీ’

Anu

Anu

Anasuya: హాట్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇంకోపక్క సోషల్ మీడియాలో నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్లు. హాట్ హాట్ డిబేట్లతో అభిమానులను ఎంటర్ టైన్ చేస్తుంది. ఇక మొన్నటివరకు అనసూయ ఆంటీ వివాదం ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనను ఆంటీ అన్నవారిపై కేసు కూడా పెట్టింది. అయినా ట్రోలర్స్ మాత్రం ఆ పదాన్ని మాత్రం వదలడం లేదు. ఇక సృష్టించడంలో అనసూయ తరువాతే ఎవరైనా.. మొదటి నుంచి హీరో విజయ్ దేవరకొండకు, అనసూయ కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అన్న విషయం తెల్సిందే అర్జున్ రెడ్డి సినిమాలో లిప్ కిస్ నుంచి మొదలైన వివాదం ఇప్పటికీ రగులుతూనే ఉంది. ఇక వీలు కుదిరినప్పుడల్లా అనసూయ దానికి ఆజ్యం పోస్తూనే ఉంది. విమర్శలు అందుకుంటూనే ఉంది.

చక్కనమ్మలు చిక్కినా అందమే.. కానీ, మరీ ఇంతా

తాజాగా మరోసారి.. అనసూయ.. విజయ్ పై ట్వీట్ వేసి మరో కొత్త వివాదానికి తెరలేపింది. ” ఇప్పుడే ఒకటి చూసాను.. ‘ది’ నా..? బాబోయ్.. పైత్యం.. ఏం చేస్తాం.. అంటకుండా చూసుకుందాం” అని రాసుకొచ్చింది. అసలు విషయమేంటి.. అంటే విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషీ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా పోస్టర్లపై విజయ్ దేవరకొండ పేరుకు ముందు ది అని ఉంటుంది. ది విజయ్ దేవరకొండ అని రాసి ఉంటుంది. అది చూసిన అనసూయ.. ఈ ట్వీట్ చేసింది అని చెప్పుకొస్తున్నారు. అమ్మడు అలా ట్వీట్ చేసిందో లేదో ఇలా వైరల్ గా మారింది. ఇక ట్రోలర్స్ కామ్ గా ఊరుకుంటారా .. ది ని నువ్వు ట్రెండ్ చేస్తే.. ఆంటీని మరోసారి మేము ట్రెండ్ చేస్తామని.. ఆంటీ మీకెందుకు ఇప్పుడు అని కొందరు.. నువ్వు కూడా ది ఆంటీ అని పెట్టుకో అని ఇంకొందరు..గాలికిపోయే కంపను మళ్లీ తగిలించుకోవడం అవసరమా ‘ఆంటీ’ అని ఇంకొందరు ట్రోల్స్ చేస్తున్నారు. మరి ఈ ట్రోలర్స్ కు అను ఎలా స్పందిస్తుందో చూడాలి.

Exit mobile version