Anasuya: పుష్పలో అల్లు అర్జున్ కొన్ని తప్పులు చేశాడు.. అనసూయ ఏమన్నదంటే ..?

Pushpa

Pushpa

Anasuya: నటి అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ముఖ్యంగా అనసూయకు బాగా గుర్తింపు తెచ్చిన సినిమాలు అంటే.. క్షణం, రంగస్థలం, పుష్ప. సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్పలో దాక్షాయణి పాత్రలో అనసూయ ఊర మాస్ లుక్ లో కనిపించింది. సునీల్ భార్యగా.. ఆమె నటన అద్భుతం. పుష్పలో తక్కువ సమయమే ఉన్నా.. పుష్ప 2 లో తన పాత్ర మరింత ఆసక్తిగా ఉంటుందని అనసూయ చెప్పడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకు గాను బన్నీకి నేషనల్ అవార్డు కూడా దక్కింది. ఇక ప్రస్తుతం అందరి చూపు పుష్ప 2 మీదనే ఉంది. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. సుకుమార్.. పుష్ప కన్నా వంద రెట్లు ఎక్కువ ఉండేలా పుష్ప 2 ను రెడీ చేస్తున్నాడు. ఇక పుష్ప 2 కోసం అల్లు అర్జున్ చాలా కష్టపడుతున్నాడు కూడా.

Allu Arjun: మంగళవారం కోసం రంగంలోకి నేషనల్ అవార్డు విన్నర్..

అనసూయ ఎప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చినా కూడా పుష్ప గురించి ఏదో ఒక విషయం చెప్తూనే ఉంటుంది. అయితే తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేసిందని వార్తలు వచ్చాయి. “ఇటీవల కాలంలో తన డ్యాన్స్‌కి సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న వ్యాఖ్యలను గమనించిన అల్లుఅర్జున్.. ఆ ఫీడ్‌బ్యాక్ తీసుకుని పుష్ప 2లో తన డ్యాన్స్ మూవ్స్‌పై ఫోకస్ చేసాడు. డ్యాన్స్ మాత్రమే కాకుండా పుష్పలో కొన్ని తప్పులు కూడా చేశాడు. ఇక వాటిని కూడా గమనించి.. అలాంటి తప్పులు మళ్లీ రీపీట్ కాకుండా జాగ్రత్త పడుతున్నాడు” అని అనసూయ చెప్పినట్లు ట్విట్టర్ లో వార్త వైరల్ గా మారింది. ఇక ఈ వార్తలను అనసూయ ఖండించింది. ” నేను అల్లు అర్జున్ గురించి ఇలాంటి మాటలు ఎప్పుడు అనలేదు. ఇది తారుమారు చేసిన ప్రకటన” అంటూ చెప్పుకొచ్చింది. దీంతో అభిమానులు ఈ వార్తను కొట్టిపారేస్తున్నారు. మరి ఈ సినిమాతో అనసూయ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.