Anasuya Bharadwaj Reveals Reason Behind Not Participating In Godfather Promotions: కేవలం ప్రధాన పాత్రధారులే కాదు.. కీలక పాత్రల్లో నటించిన నటీనటులు సైతం సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఇంటర్వ్యూలలో, ఈవెంట్లలో పాల్గొంటూ.. తమ పాత్ర ప్రత్యేకతను వివరిస్తుంటారు. అయితే.. యాంకర్ కమ్ నటి అనసూయ మాత్రం ‘గాడ్‌ఫాదర్’ సినిమా ప్రమోషన్స్‌కి దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది. ఇందులో ఓ కీలక పాత్రలో నటించిన ఈ భామ.. ప్రమోషన్స్‌లో ఎక్కడా కనిపించలేదు. న్యూస్ రిపోర్టర్‌గా మంచి పాత్రలో నటించినా.. ఎందుకు ప్రచార కార్యక్రమాలకి దూరంగా ఉందో అంతుపట్టలేదు. అయితే.. ఈ మిస్టరీకి అనసూయ తాజాగా తెరదించింది. తానెందుకు ఈ సినిమా ప్రమోషన్స్‌కి దూరంగా ఉన్నానో రివీల్ చేసింది.
సోషల్ మీడియాలో ఓ నెటిజన్.. ‘‘గాడ్‌ఫాదర్‌లో మీరు ఓ కీలక పాత్రలో నటించారు. అది నాకెంతో నచ్చింది. సినిమాలో ఇంత మంచి రోల్ చేసినప్పటికీ.. మీరెందుకు ప్రమోషన్స్‌లో ఎక్కడా కనిపించలేదు?’’ అని ప్రశ్నించాడు. అందుకు అనసూయ బదులిస్తూ.. తాను ఒకేసారి చాలా షూటింగ్స్‌తో బిజీగా ఉండటం వల్లే ప్రమోషన్స్‌కి రావడం కుదరలేదని సమాధానం ఇచ్చింది. ‘‘మీరు ఇది తప్పకుండా నమ్మాల్సిందే.. నేను ఒకే సమయంలో చాలా షూటింగుల్లో పాల్గొంటున్నాను. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసమే నేనెంతో కష్టపడుతున్నాను’’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా.. సినిమాలతో పాటు బోలెడన్నీ టీవీ షోలతో అనసూయ ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే! ఆ బిజీ షెడ్యూల్ వల్లే అనసూయ గాడ్‌ఫాదర్ ప్రమోషన్స్‌కి దూరంగా ఉందని స్పష్టమవుతోంది.
కాగా.. మలయాళంలో మంచి విజయం సాధించిన ‘లూసిఫర్’కి గాడ్‌ఫాదర్ రీమేక్. మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా.. దసరా కానుకగా సెప్టెంబర్ 5వ తేదీన విడుదల అయ్యింది. ప్రేక్షకుల నుంచి క్రిటిక్స్ దాకా ఈ చిత్రానికి మంచి రివ్యూలు రావడంతో, బాక్సాఫీస్ వద్ద ఇది మంచి వసూళ్లు నమోదు చేస్తోందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
