NTV Telugu Site icon

Anasuya Bharadwaj: ‘బేగం హ‌జ్ర‌త్ మ‌హ‌ల్‌’గా మారిపోయిన అనసూయ భ‌రద్వాజ్

Anasuya Bharadwaj

Anasuya Bharadwaj

Anasuya Bharadwaj as Begum Hazrat Mahal: ఈమధ్య కాలంలో యాంకరింగ్ పక్కన పెట్టి సినిమాల మీద దృష్టి పెట్టిన అనసూయ తాజాగా చేసిన ట్వీట్ హాట్ టాపిక్ అవుతోంది. అసలు విషయం ఏమిటంటే అనసూయ భ‌రద్వాజ్ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా దేశం కోసం పోరాడిన వారిలో ఒక‌రైన బేగం హ‌జ్ర‌త్ మ‌హ‌ల్‌ను గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేసారు. 1857 క్విట్ ఇండియా ఉద్యమంలో భారతీయులు భారీ సంఖ్యలో పాల్గొని దేశం కోసం తమ ప్రాణాలను అర్పించారు. ఈ క్విట్ ఇండియా ఉద్యమంలో పురుషులు మాత్రమే కాదు, కొంతమంది మహిళలు కూడా ఉద్యమానికి మద్దతు పలికారు. ఈ ఉద్యమంలో పాల్గొన్న మహిళల్లోఒకరు బేగం హజ్రత్ మహల్, తన ధైర్యసాహసాలతో అవధ్‌ను బ్రిటిష్ పాలకుల నుంచి విముక్తి కోసం పోరాటం చేసి బేగం హజ్రత్ మహల్ అభినవ ‘లక్ష్మీభాయి’గా భవిస్తూ ఉంటారు.

Dhanush: స్కూల్ ఫ్రెండ్స్ తో స్టార్ హీరో రీయూనియన్.. వైరల్ అవుతున్న ఫోటోలు

ఇప్పుడు అలంటి ఆమె లుక్ ను రీ క్రియేట్ చేస్తూ అన‌సూయ పోస్ట్ చేసిన ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. “” 1857 కాలం నాటి స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధురాలు, ఆవాధీ క్వీన్ బేగం హ‌జ్‌ర‌త్ మ‌హ‌ల్‌ను గుర్తుచేసుకుంటూ ఆమెకు ఇలా నివాళులు అర్పిస్తున్నానని అనసూయ పేర్కొన్నారు. దేశం కోసం ఆమె పోరాడిన తీరుకు గుర్తుగా 1984 మే 10న ఆమె ఫొటోతో ప్ర‌భుత్వం స్టాంప్‌ను రిలీజ్ చేసింది, దానిని కూడా ఆమె పోస్ట్ చేశారు. ఇక ఈ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా మ‌ర్చిపోయిన పోరాట యోధుల‌ను గుర్తుచేసుకుందాం “” అని వరుస ట్వీట్లు చేశారు అన‌సూయ‌ భరద్వాజ్.