NTV Telugu Site icon

Ananya Pandey: ఆ పనిచేస్తూ అడ్డంగా దొరికిన ‘లైగర్’ బ్యూటీ.. సిగ్గులేదు

Ananya

Ananya

Ananya Pandey: అనన్య పాండే.. లైగర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ. విజయ్ దేవరకొండ సరసన నటించింది కానీ మెప్పించలేకపోయింది. అమ్మడి నటన చూసి కుర్రకారు బెంబేలెత్తిపోయారు. ఓవర్ యాక్షన్ కు బ్రాండ్ అంబాసిడర్ లా ఉందే అంటూ చెప్పుకొచ్చారు. ఇక అనన్య.. టాలీవుడ్ లో హిట్ కొట్టి సెటిల్ అవుదాం అనుకున్నా అదిమాత్రం కుదరనిపని అని పాపం వెనక్కి వెళ్ళిపోయింది. ఇక ఈ విషయాలను పక్కన పెడితే.. సోషల్ మీడియాలో అమ్మడికి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి చెప్పనవసరం లేదు. బికినీ దగ్గరనుంచి అన్ని డిజైనర్ డ్రెస్ ల్లో అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతూ ఉంటుంది. తాజాగా ఈ చిన్నది తన పరువును తానే అడ్డంగా తీసుకొంది. తన కజిన్ పెళ్ళిలో సిగరెట్ తాగుతూ మీడియా కంట పడింది. ఇంకేముంది నెటిజన్స్ అమ్మడిని ట్రోల్స్ చేయడం మొదలుపెట్టేశారు.

Friday Releases: ఈవారం థియేట్రికల్ రిలీజెస్ ఇవే!

రెండు రోజుల క్రితం జరిగిన ఒక పెళ్ళిలో అనన్య పాల్గొంది. అది పాండే కుటుంబానికి సంబంధించిన పెళ్లి అని సమాచారం. ఒక పక్క పెళ్లి జరుగుతుంటే.. అనన్య సీక్రెట్ గా సిగరెట్ తాగుతూ కనిపించింది. ఎంతో సంప్రదాయంగా పెళ్లి జరుగుతున్న పందిరిలో ఇలా సిగరెట్ తాగడం ఏంటి అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. సెలబ్రిటీలు అన్నాకా.. సిగరెట్లు, మందు తాగడం చాలా కామన్. అందులోనూ చాలామంది హీరోయిన్లు సైతం సిగరెట్ తాగడం కూడా మీడియా కంటపడింది. అయితే సమయం, సందర్భం కూడా చూసుకోవాలి కదా.. పెళ్లి మండపంలో ఇలా చేయడం పద్దతి కాదని చెప్పుకొస్తున్నారు. ఏదిఏమైనా ఈ ఒక్క వివాదం అనన్య పరువు మొత్తం తీసేసిందనే చెప్పాలి. మరి ఈ సంఘటనపై అనన్య ఎలా స్పందిస్తుందో చూడాలి.

Show comments