Ananya Pandey : సినీ రంగంలో బాడీ షేమింగ్ అనేది కామన్ అయిపోయింది. ఇప్పటికే చాలా మంది హీరోయిన్లపై ఇలాంటి కామెంట్లు చేశారు. కొందరు తమపై జరిగిన బాడీ షేమింగ్ న్ బయట పెట్టారు కూడా. ఇండస్ట్రీలోనే కాదు సోషల్ మీడియాలో కూడా ఇది కామన్ గా జరుగుతోంది. తాజాగా అనన్య పాండే కూడా దీనిపై స్పందించింది. తానూ ఆ బాధితురాలినే అంటూ తెలిపింది. అనన్య పాండే ప్రస్తుతం బాలీవుడ్ లోనే వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. అక్కడే సినిమాలు చేసుకుంటోంది ఈ భామ.
Read Also : India-Pak: సింధు జలాలపై భారత్ మాస్టర్ ప్లాన్!
‘నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో కాస్త సన్నగా ఉన్నాను. అప్పుడు నా వయసు 18 ఏళ్లు మాత్రమే. అప్పుడు నన్ను చూసిన చాలా మంది కోడి కాళ్లు, అగ్గిపుల్లలా ఉన్నావ్ అంటూ షేమ్ చేశారు. చాలా బాధపడ్డాను. కానీ తర్వాత వాటి గురించి ఆలోచించడం మానేశాను. నా సినీ లైఫ్ మీద ఫోకస్ పెట్టాను. చాలా మందిపై ఇలాంటి కామెంట్స్ వింటూనే ఉన్నాను.
సోషల్ మీడియాలోనే కాదు ఇండస్ట్రీలో కూడా ఇలాంటివే వినిపించాయి. హీరోయిన్ అంటే ఇలాంటి ఫిజిక్ కావాలనే రూల్స్ పెట్టుకున్నాం. కాబట్టి దాని కోసం కష్టపడాలి. తప్పదు. ఇక్కడ అవకాశాల కోసం ప్రయత్నాలు చేయాలన్నా సరే మనకు సరైన అర్హత ఉండాలి. యాక్టింగ్ ఒక్కటే ఉంటే ఈ రోజుల్లో సరిపోదు. కచ్చితంగా పర్ ఫెక్ట్ బాడీ ఉండాలి’ అంటూ తెలిపింది అనన్య పాండే.
Read Also : Thug life : కమల్ హాసన్ ’థగ్ లైఫ్’ తెలుగు ట్రైలర్ రిలీజ్..
