Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Film Celebrity Interviews Ananya Nagalla Interview For Pottel Movie

Ananya Nagalla: ‘పొట్టేల్’లో పొట్టలో తన్నారు.. భయం వేసింది: అనన్య నాగళ్ల ఇంటర్వ్యూ

Published Date :October 21, 2024 , 5:28 pm
By Bhargav Chaganti
  • అనన్య నాగళ్ల లీడ్ రోల్ లో రూరల్ యాక్షన్ డ్రామా 'పొట్టేల్'
  • సాహిత్ మోత్ఖూరి డైరెక్ట్ చేస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా 'పొట్టేల్'
  • అక్టోబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో పొట్టేల్ విడుదల
Ananya Nagalla: ‘పొట్టేల్’లో పొట్టలో తన్నారు.. భయం వేసింది: అనన్య నాగళ్ల ఇంటర్వ్యూ
  • Follow Us :
  • google news
  • dailyhunt

యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్ లో సాహిత్ మోత్ఖూరి డైరెక్ట్ చేస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా ‘పొట్టేల్’. ఈ చిత్రంలో అజయ్ పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నారు. నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కు స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేశాయి. శేఖర్ చంద్ర అందించిన సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ‘పొట్టేల్’ అక్టోబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ అనన్య నాగళ్ల విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.

‘పొట్టేల్’ మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఇందులో మిమ్మల్ని ఎట్రాక్ట్ చేసిన ఎలిమెంట్స్ ఏమిటి ?
-ఈ ప్రాజెక్ట్ గురించి మొదట నిర్మాత నిశాంక్ గా కాల్ చేసి చెప్పారు. తర్వాత డైరెక్టర్ సాహిత్ కథ చెప్పారు. కథ చాలా బావుంది. అయితే ఇంతకుముందు మదర్ గా ఒక వెబ్ సిరిస్ చేశాను. మళ్ళీ మదర్ అంటే సిమిలర్ అవుతుందేమో అనుకున్నాను. అయితే ఇందులో చదువు అనే పాయింట్ చాలా నచ్చింది. ఇంత మంచి కాన్సెప్ట్, కథలో ఎలా అయిన పార్ట్ కావాలని చేశాను. చేసిన తర్వాత తెలిసింది, ఆ సిరిస్ లో చేసిన రోల్ కి ఇందులో రోల్ కి కంప్లీట్ డిఫరెన్స్ వుంది. ఎక్కడా పోలిక లేదు.

Also Read

  • NBK - Koratala Siva మూవీ స్టోరీ లీక్.. మాఫియా డాన్‌గా బాలయ్య! ఇక నందమూరి ఫ్యాన్స్‌కు పూనకాలే..
  • Tollywood Star Hero: ధురందర్ డైరెక్టర్ తో సినిమాకి తెలుగు స్టార్ హీరో యత్నాలు?
  • Hero Dupes: డబ్బు పెట్టే వాడికి లేని నొప్పి మనకెందుకు? .. జేడీ కీలక వ్యాఖ్యలు
  • Jyoti Poorvaj : అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్

ఇందులో మీ క్యారెక్టర్ ఎలా వుంటుంది ?
-ఇందులో నా క్యారెక్టర్ చాలా ఇంట్రస్టింగ్ గా వుంటుంది. ట్రైలర్ లో ఎక్కువ రివిల్ చేయలేదు. సినిమాలో అందరూ సర్ ప్రైజ్ అవుతారు. ఇందులో నా క్యారెక్టర్ పేరు బుజ్జమ్మ. ఇప్పటివరకూ మల్లేశం అనన్య, వకీల్ సాబ్ అనన్య అనే పిలుస్తుంటారు. ఈ సినిమా తర్వాత బుజ్జమ్మ అనన్య అని పిలుస్తారు. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఈ క్యారెక్టర్ ని డైరెక్టర్ గారు చెప్పినట్లుగా చేశాను.

-ఇందులో నాది చాలా స్ట్రాంగ్ రోల్. ఇందులో పొట్టలో తన్నే సీన్ ఒకటి వుంది. ఆ సీన్ ఎలా వస్తుందో అని మొదట కాస్త కంగారు పడ్డాను. అయితే అజయ్ గారు చాలా సీనియర్. ఆయన ఎక్స్ పీరియన్స్ తో చాలా కంఫర్ట్ బుల్ గా చేశారు. అజయ్ గారు వెరీ డౌన్ టు ఎర్త్ పర్శన్. ఆయనలాంటి ఎక్స్పీరియన్స్ యాక్టర్ ఉండటంవల్ల ఈ ఆ సీన్ అంత కంఫర్టబుల్ గా వచ్చింది. ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ ఒక మేజర్ హైలట్ గా వుంటుంది.

ట్రైలర్ రిలీజ్ తర్వాత రియాక్షన్స్ ఏమిటి ?
-అన్ఎక్స్పెక్టెడ్ గా చాలామంది ఫ్రెండ్స్ కాల్ చేసి ట్రైలర్ అదిరిపోయింది అని చెప్పారు . వకీల్ సాబ్ మినహిస్తే నా నుంచి ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రైలర్ అని చెప్పారు.

‘పొట్టేల్’ టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి?
-పొట్టేల్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ. పొట్టేల్ లేకపోతే ఈ కథ లేదు. పొట్టేల్ పరిగెత్తుతూ వెళ్తున్నప్పుడు కొండ అడ్డం వస్తే దాన్ని ఢీకొడుతుంది కానీ ఆగదు. అది పొట్టేల్ నేచర్. ఈ సినిమాలో మా హీరో క్యారెక్టర్ కూడా అలానే ఉంటుంది. ఏ ప్రాబ్లం వచ్చిన ముందుకు వెళ్లడమే కానీ వెనక్కి వచ్చే సమస్య లేదు. అలా రెండు విధాలుగా ఈ సినిమా టైటిల్ కి జస్టిఫికేషన్ వచ్చింది.

-ఈ సినిమాలో ప్రతిపాత్రకి ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ కి ఒక ఆర్క్ ఉంటుంది. ఈ సినిమాలో చేసిన ప్రతి యాక్టర్ కి వాళ్ళ కెరియర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ అవుతుందని గర్వంగా చెప్పగలను. అంతా బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. సినిమా చూసిన తర్వాత ఈ మాట చెబుతున్నాను.

యువతో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
-యువ వెరీ టాలెంటెడ్. మేమిద్దరం ఇన్ఫోసిస్ లో వర్క్ చేసేవాళ్ళం. అక్కడ ఆయన షార్ట్ ఫిలిమ్స్ వచ్చేసేవాళ్ళు. ఆయనతో ఎప్పుడు నేరుగా మాట్లాడలేదు కానీ ఆయన చేసిన షార్ట్ ఫిలిమ్స్, ఆ ఫ్యాషన్ తో ఇన్స్పైర్ అయ్యి ఇండస్ట్రీ లోకి వచ్చాను. ఈ సినిమాలో చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేస్తున్నారు. పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా చేశారు. ఆడియన్స్ అందరికీ డెఫినెట్ గా నచ్చుతుంది.

ఈ సినిమాలో మేజర్ హైలెట్స్ ఏమిటి?
-స్టోరీ లైన్ ఈ సినిమాకి మెయిన్ హైలెట్. కమర్షియల్ ఎలిమెంట్స్ ని, మెసేజ్ ని, తెలంగాణ కల్చర్ ని అద్భుతంగా బ్లెండ్ చేసిన సినిమా ఇది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా నచ్చింది. యువ, పాప మధ్య వచ్చే సీన్స్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వల్ల చాలా ఎమోషనల్ గా ఉంటాయి. కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తాయి. యాక్టర్స్ అందరి పెర్ఫార్మెన్స్ లు అద్భుతంగా ఉంటాయి.

ఈ సినిమాలో లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి?
-కథ, క్యారెక్టర్, డైరెక్టర్ అప్రోచ్ అయ్యే విధానం బాగుంటే సినిమా చేయొచ్చు అనే ఫీలింగ్ ఉండేది. ఈ సినిమాతో ప్రొడ్యూసర్స్ రియల్లీ ఇంపార్టెంట్ ఫర్ ద ఫిలిం అని అర్థమైంది. సినిమాకి ఏం కావాలి, ఎంత పెట్టాలి అనేది ప్రొడ్యూసర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటేనే ఒక ప్రాజెక్టు ఇంత అద్భుతంగా వస్తుంది. సినిమాని ఆడియన్స్ వరకు ప్రొడ్యూసర్స్ తప్ప మరెవరూ తీసుకెళ్లలేరు. అది ఈ సినిమాతో అర్థమైంది. డైరెక్టర్ తో పాటు ప్రొడ్యూసర్ కి కూడా ఫ్యాషన్ ఉంటేనే ఒక కథని ఆడియన్స్ వరకు రీచ్ చేయగలరు. సురేష్ అండ్ నిశాంక్ ఇద్దరు పర్ఫెక్ట్ కాంబినేషన్. వారిద్దరి కాంబినేషన్ వల్ల ఈ సినిమా ఇంత బ్యూటిఫుల్ గా వచ్చింది.

మైత్రీ వారు ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు కదా వాళ్ళ రియాక్షన్ ఏంటి?
మైత్రీ వారు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇలాంటి సినిమా ఈ మధ్యకాలంలో తెలుగులో రాలేదని చెప్పారు.

మీకు వస్తున్న క్యారెక్టర్స్ పట్ల హ్యాపీగా ఉన్నారా ?
-ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కొన్ని లవ్ స్టోరీస్, క్యూట్ క్యారెక్టర్స్ చేద్దామనుకున్నాను. అయితే అప్పుడు నాకు అంత అవగాహన లేదు. మల్లేశం వచ్చిన తర్వాత ప్రేక్షకులు ఒక డిఫరెంట్ లుక్ లో చూశారు. మెచ్యూర్ గా చేస్తున్నాను కాబట్టి ఇలాంటి క్యారెక్టర్ ఇద్దామని అనుకున్నారు. ఈ విషయంలో హ్యాపీగానే ఉంది. దీనివల్ల ఒక డిఫరెంట్ సెట్ అప్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యాను. ఇలాంటి పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రూల్స్ కావాలంటే తెలుగు అమ్మాయిల్లో ఉన్న ఇద్దరు ముగ్గురు లో నా పేరు కూడా వినిపిస్తుంది. అందుకే పొట్టేల్ లాంటి స్టోరీస్ వస్తున్నాయని భావిస్తున్నాను. మా అమ్మగారు ఈ సినిమా చూసి చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారని నమ్ముతున్నాను.

కొత్తగా చేస్తున్న సినిమాల గురించి ?
-శ్రీకాకుళం షెర్లక్ హోమ్స్ సినిమా రిలీజ్ కి రెడీగా వుంది. సతీష్ వేగేశ్న గారి కథకళి సినిమా జరుగుతుంది. ‘లేచింది మహిళా లోకం’అనే సినిమా చేస్తున్నాను.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #pottel
  • Ajay
  • Ananya Nagalla
  • Sahith Mothkuri
  • Yuva Chandra

తాజావార్తలు

  • DC Vs RCB: చెత్త రికార్డు మూట కట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. 6 ఓవర్లలోపే చేతులెత్తేశారుగా..

  • Salary Delay: సారీ బాస్.. ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్! ఈసారి ‘ఫస్ట్’కు శాలరీ రాదు.. ఎందుకో తెలుసా?

  • Putin – Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్‌కు రష్యా ‘ఫుల్’ సపోర్ట్..!

  • AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!

  • CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!

ట్రెండింగ్‌

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions