NTV Telugu Site icon

Anantha Sriram: దివంగత వైఎస్సార్‌ను అవమానపరిచేలా పోస్టులు.. వీడియో రిలీజ్ చేసిన అనంతశ్రీరామ్

Anantha Srreeram Video On Ysr

Anantha Srreeram Video On Ysr

Anantha Sreeram Releases a video on ysr trolling posts: తెలుగు ప్రేక్షకులందరికీ అనంత శ్రీరామ్ ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో అనేక సూపర్ హిట్ సినిమాలకు పాటలు రాశారు అనంత శ్రీరామ్. చిన్న వయసు వాడైనా సరే సాహితీ సంపదలో చాలా పెద్దవాడు అని అనేకమంది సినీ రచయితలు ఆయనను మెచ్చుకుంటూ ఉంటారు. అలాంటి అనంత శ్రీరామ్ అనూహ్యంగా ఒక వివాదంలో చిక్కుకున్నాడు ఈ నేపథ్యంలో ఆ వివాదానికి సంబంధించిన క్లారిటీ ఇస్తూ ఒక వీడియో విడుదల చేశారు. ఈ మేరకు అనంత శ్రీరామ్ సోషల్ మీడియా ఖాతాల ద్వారా నిముషం 19 సెకండ్ ల నిడివి గల ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఆ వీడియోలో అనంత శ్రీరామ్ మాట్లాడుతూ ‘’నమస్కారం అండి నేను అనంత శ్రీరామ్, దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఆయనను అవమానపరిచేలా పొలిటికల్ మిస్సైల్ అనే ఒక ట్విట్టర్ ఖాతాలో కొన్ని రాతలు రాస్తూ పోస్టులు పెడుతున్నారు.

Pawan Kalyan: ఒక్క పోస్టు కూడా లేకుండానే పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ రికార్డు.. కానీ?

ఆ రాతల వెనుక ఆ పోస్టుల వెనుక ఉన్నది నేనే అనే వదంతులు వ్యాపించాయి, అయితే నాకు ఆ రాతలకు ఆ పోస్టులకు అవి పోస్ట్ చేస్తున్న ఖాతాకు ఎలాంటి సంబంధం లేదు. నా వృత్తి రీత్యా నేను అన్ని పార్టీలకు పాటలు రాస్తాను, అంతే తప్ప వ్యక్తిగతంగా ఏ పార్టీ మీద నాకు ఎలాంటి అభిప్రాయం లేదు. అవన్నీ నమ్మవద్దని నేను వైసీపీ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నాను, ఒకవేళ భవిష్యత్తులో రాజకీయాల మీద ఎలాంటి అభిప్రాయం తెలియజేయాల్సి వచ్చిన, అది నిక్కచ్చిగా నిర్భయంగా నా అధికారిక సామాజిక మాధ్యమాల్లో తెలియజేస్తానని అంతే తప్ప ఇలా ఊరు పేరు లేని ఖాతాల ద్వారా ఎలాంటి అభిప్రాయాలు వెల్లడించనని భవిష్యత్తులో కూడా ఇది జరగదని మాట ఇస్తున్నాను. ప్రస్తుతం నేను నాటా మహాసభల్లో పాల్గొనడానికి అమెరికా రావడం జరిగింది, అందువల్ల నేను భారత దేశంలో లేను, అమెరికా నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఈ విషయం మీద ఖచ్చితంగా సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేస్తాను అంటూ చెప్పుకొచ్చారు. ఇక అనంత శ్రీరామ్ మాట్లాడుతున్న వీడియోస్ అయితే మీరు కింద చూడవచ్చు.

Show comments