Site icon NTV Telugu

Suhas: ఆనందరావ్ చేసిన అడ్వంచర్స్ ఏమిటీ!?

Suhas

Suhas

Anandrao Adventures: సుహాస్ హీరోగా రామ్ పసుపులేటి దర్శకత్వంలో జాపీ స్టూడియోస్ నిర్మిస్తున్న ‘ఆనందరావ్ అడ్వంచర్స్’ చిత్ర ప్రారంభోత్సవం బుధవారం రామానాయుడు స్టూడియోస్ లో జరిగింది. పూజా కార్యక్రమం అనంతరం టైటిల్ తో పాటు ఫస్ట్-లుక్ పోస్టర్‌ ను కూడా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రానా దగ్గుబాటి, ఆనంద్ దేవరకొండ, క్రిష్, నందిని రెడ్డి, బివిఎస్ రవి తదితరులు హాజరయ్యారు. ఈ ఫెయిరీ టేల్ ఫాంటసీ చిత్రాన్ని జూపీ స్టూడియోస్ ప్రొడక్షన్ నంబర్ 4గా నిర్మించబోతోంది. ఉదయ్ కోలా, విజయ్ శేఖర్ అన్నె, సురేష్ కొత్తింటి దీనికి నిర్మాతలు. సుహాసిని రాహుల్, మురళీ జంపన సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ఈ సందర్భంగా సుహాస్‌ మాట్లాడుతూ, ”త్వరలో సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఐదేళ్ళుగా ఈ దర్శకుడు తెలుసు. ఆయన చెప్పిన 7వ కథ ఇప్పుడు వెండితెరకు ఎక్కబోతోంది. పోస్టర్‌ లోనే కంటెంట్‌ తెలిసిపోతోంది. నాతో ఈ చిత్రాన్ని తీస్తున్న నిర్మాతలకు ధన్యవాదాలు” అని అన్నారు. సహ నిర్మాత సుహాసిని మాట్లాడుతూ, ”మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వెళ్తున్నాం. మాకు స్పూర్తి అయిన రానా గారు వచ్చి ఆశీస్సులు అందించడం ఆనందంగా వుంది” అని చెప్పారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించిన రామ్ పసుపులేటి మాట్లాడుతూ, ”చిల్డ్రన్ ఫాంటసీ కథ తో ఇది తెరకెక్కుతుంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేస్తాం” అని అన్నారు. ఈ సినిమాకు మిక్కీ జె. మేయర్ సంగీతం సమకూర్చుతుండగా, రాకేష్ ఎస్ నారాయణ్ సినిమాటోగ్రఫీని అందించబోతున్నారు.

Exit mobile version