NTV Telugu Site icon

3 Ekka: 20 రోజుల్లో 25 కోట్లు.. రికార్డులు బద్దలు కొడుతున్న గుజరాతీ సినిమా

3 Ekka

3 Ekka

Anand Pandit’s Gujarati film ‘3 Ekka’ sets many records:3Ekka (3 ఆసులు) అనే గుజరాతీ కామెడీ ఫిల్మ్ బాక్సాఫీస్ దగ్గర సంచనాలు సృష్టిస్తోంది. అత్యధిక ఓపెనింగ్స్ రికార్డుతో పాటు మొదటి వారం రికార్డులని కూడా తుడిచిపెట్టిన ఈ సినిమా మూడు వారాల తర్వాత కూడా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది. ఆర్థిక కష్టాల్లో పడ్డ ముగ్గురు ఫ్రెండ్స్ ఒక మధ్యతరగతి ఇంటిని సీక్రెట్ గాంబ్లింగ్ డెన్‌గా మార్చాలని చేసిన ప్రయత్నాలు ఎలాంటి పరిణామాలకు దారితీశాయనే ప్రధానాంశంగా ఈ సినిమా తెరకెక్కించారు. ఇక ఈ గుజరాతీ చిత్రాన్ని ఆనంద్ పండిట్నిర్మాణంలో ‘3 ఎక్క’ అనే పేరుతో తెరకెక్కించారు. ఇటీవల మేకర్స్ సక్సెస్ పార్టీని కూడా ఏర్పాటు చేయగా అహ్మదాబాద్‌లో పెద్ద ఎత్తున గుజరాతీ చిత్ర పరిశ్రమ నుంచే కాకుండా పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఇషా కన్సారా, కింజల్ రాజ్ ప్రియా, యష్ సోనీ, మల్హర్ థక్కర్ వంటి పలువురు తారలు ఈ సినిమాలో కనిపించారు.

Devil first single: కళ్యాణ్ రామ్ ను ‘మాయ’ చేసిన సంయుక్త!

ఇక రాజేష్ శర్మ దర్శకత్వం వహించిన ఈ ‘3 ఎక్క’ అనే సినిమా 20 రోజుల్లో రూ. 26.11 కోట్లు వసూలు చేసింది. మీడియా కథనాల ప్రకారం ఈ సినిమా బడ్జెట్ కేవలం 5 కోట్లు మాత్రమే కాగా ఆనంద్ పండిట్ నిర్మించిన ఈ సినిమా ఖర్చు కంటే నాలుగు రెట్లు ఎక్కువ వసూళ్లు సాధించింది. అంతకుముందు ఆనంద్ పండిట్ నిర్మించిన ‘ఫకత్ లమన్ మాటే’ కూడా బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లు రాబట్టింది. గుజరాతీ “3 ఎక్క” ఆగష్టు 25న థియేటర్లలో విడుదలైంది. ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొడుతూనే ఉంది. ఈ సంచలనాత్మక గుజరాతీ చిత్రం అనేక రికార్డులు బద్దలు కొట్టింది. అత్యధిక బాక్సాఫీస్ కలెక్షన్లను సాధించిన మొదటి గుజరాతీ చిత్రంగా నిలిచింది. మొదటి రోజు అత్యధిక వసూళ్లు, మొదటి అత్యధిక వారాంతపు వసూళ్లు, మొదటి వారం అత్యధిక వసూళ్లు సాధించిన మొదటి గుజరాతీ చిత్రంగా నిలిచింది .ముఖ్యంగా, 3 ఎక్కా బాక్సాఫీస్ వద్ద విడుదలైన 20 రోజుల్లోనే 25 కోట్ల మార్క్‌ను దాటిన మొదటి గుజరాతీ చిత్రంగా గుర్తింపు పొందింది..

Show comments