NTV Telugu Site icon

Anand Deverakonda: రష్మికతో రిలేషన్ గురించి అడిగిన రిపోర్టర్.. షాకిచ్చిన చిన్న దేవరకొండ

Anand Devarakonda Comments On Rashmika Mandanna

Anand Devarakonda Comments On Rashmika Mandanna

Anand Deverakonda shocking answer on his relation with rashmika: ఛలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన తర్వాత విజయ్ దేవరకొండతో కలిసి గీత గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సినిమాల్లో నటించింది. గీత గోవిందం సినిమా సమయం నుంచి ఆమెకు విజయ్ దేవరకొండకు మధ్య ప్రేమ మొదలైంది అనే ప్రచారం ఊపందుకుంది. దానికి ఊతమిస్తూ అంతకుముందే కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో రష్మిక చేసుకున్న ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకోవడం ఈ ప్రచారానికి మరింత ఆజ్యం పోసినట్టు అయింది. ఇక ఆ తర్వాత ఎప్పటికప్పుడు విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరూ ప్రేమలో ఉన్నారని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని ఇలా రకరకాల ప్రచారాలు తెరమీదకు వస్తూనే ఉన్నాయి. ఒక్కో సందర్భంలో సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ పోస్ట్ చేసిన ఫోటోలు, రష్మిక మందన పోస్ట్ చేసిన ఫోటోలు రెండింటిలో బ్యాక్ గ్రౌండ్ ఒకలానే ఉందని ఇద్దరూ పక్కపక్కనే ఉన్నారని అందరూ సోషల్ మీడియాలో కూడా కొత్త చర్చలకు దారి తీస్తూ ఉండేవారు.

Chiranjeevi: చిరంజీవి తదుపరి సినిమాకి ముహూర్తం ఫిక్స్

ఇక ఈ మధ్య విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన బేబీ సినిమాకు సంబంధించిన ఒక ప్రమోషనల్ ఈవెంట్ కి రష్మిక మందన హాజరైంది. ఆమె మాట్లాడుతున్న సమయంలో వదిన అంటూ కామెంట్లు చేయగా అందుకు ఆమె సిగ్గుపడటం కూడా జరిగింది. దీంతో ఇప్పుడు ఆనంద్ దేవరకొండ బేబీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వెబ్ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఒక మీడియా పోర్టల్ కి చెందిన వ్యక్తి రష్మిక మందనతో మీ రిలేషన్ ఎలా ఉంటుందని ఆనంద దేవరకొండని ప్రశ్నిస్తే దానికి ఆనంద్ షాక్ ఇచ్చే విధంగా సమాధానం ఇచ్చారు. మీరు ఈ సినిమా ప్రమోట్ చేసేందుకు వచ్చారా లేక కాంట్రవర్సీ ప్రశ్నలు అడిగి కాంట్రవర్సీలు చేయడానికి వచ్చారా అంటూ ఎదురు ప్రశ్నించడం గమనార్హం. ఈ క్రమంలో రష్మిక మందన గురించి ఆనంద్ దేవరకొండ ఏమి సమాధానం చెప్పకుండానే మీడియా సమావేశాన్ని ముగించడం గమనార్హం.

Show comments