తొలి సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతోనే హీరోగా సూపర్ హిట్ కొట్టాడు నవీన్ పోలిశెట్టి. జాతి రత్నాలు సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. ఇక లేడీ స్టార్ స్వీటీ శెట్టితో చేసిన మిస్టర్ శెట్టి.. మిసెస్ పోలిశెట్టి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని అనగనగా ఒక రాజు అనే సినిమా చేస్తున్నాడు నవీన్ పోలిశెట్టి. అప్పుడెప్పుడో స్టార్ట్ అయిన ఈ సినిమా అలా సాగుతూనే ఉంది.
Also Read : Dhanush : నాగార్జున – ధనుష్ ‘కుబేర’ రిలీజ్ డేట్ ఫిక్స్
నవీన్ పోలిశెట్టి పుట్టిన రోజు సందర్భంగా అనగనగా ఒక రాజు సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ గ్లిమ్స్ ప్రోమో అదిరిపోయింది అనే చెప్పాలి. కాగా ఇటీవల ఈ సినిమా నుండి ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు మేకర్స్. అయితే ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా చేసేస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఏపీలోని పాలకోల్లులో జరుగుతుంది. నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి తో పాటు మిగతా నటి నటులపై సీన్స్ తీస్తున్నారు. అలాగే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో దాదాపు 15 రోజుల పాటు షూటింగ్ చేయనుంది యూనిట్. ఆ తర్వాత హైదరాబాద్ లో సెకండ్ షెడ్యూల్ ను స్టార్ట్ చేయనున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను చక చక షూటింగ్ ఫినిష్ చేసి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు. ఈ సారి పొంగల్ లో అటు మెగాస్టార్ చిరు, యంగ్ టైగర్ డ్రాగన్ తో పోటీపడనున్నాడు అనగనగా ఒక రాజు.