Amy Jackson: అమీ జాక్సన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎవడు, ఐ, రోబో 2.ఓ సినిమాలతో ఆమె మంచి గుర్తింపు తెచ్చుకుంది. అమీ జాక్సన్.. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో కనిపించడం లేదు.. ఈ మధ్యనే తమిళ్ లో రిలీజ్ అయిన మిషన్ చాప్టర్ 1 లో కనిపించి మెప్పించింది. అమ్మడు సినిమాలతో కన్నా.. వివాదాలతోనే ఎక్కువ ఫేమస్ అయ్యింది. దాదాపు ఐదేళ్ల వరకు జార్జ్ పనయాట్టు అనే వ్యక్తితో ప్రేమలో ఉండి, అతడితోనే ఒక బిడ్డను కూడా కనింది. ఇక బిడ్డ పుట్టాకా ఈ జంట పెళ్లి చేసుకుంటారు అనుకొనేలోపు బ్రేకప్ చెప్పి షాక్ ఇచ్చారు. అయితే ఈ బ్రేకప్ తరువాత అమీ.. కొడుకును చూసుకుంటూ కొన్నేళ్లు ఒంటరిగా ఉండిపోయింది.
ఇక గత కొంతకాలంగా ఆమె..విదేశీ నటుడు ఎడ్ వెస్ట్‌విక్‌తో ప్రేమలో పడింది. వీరిద్దరూ చెట్టపట్టాలు వేసుకొని కెమెరా ముందు కనిపించడం మొదలుపెట్టారు. అయితే అమ్మడు.. మొదటి ప్రియుడులానే రెండో ప్రియుడుతో కూడా రిలేషన్ లో ఉండి.. మరో బిడ్డను కంటుందా.. ? లేక పెళ్లి చేసుకుంటుందా.. ? అనే అనుమానాలు తలెత్తాయి. అయితే తాజాగా ఎడ్ వెస్ట్‌విక్.. అమీకి ప్రపోజ్ చేశాడు. అందమైన మంచు కొండల మధ్య చుట్టూ బంధుమిత్రుల సమక్షంలో కాళ్లు వంచి అమీకి రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేశాడు. అమీ కూడా ఓకే చెప్పింది. త్వరలోనే వీరి పెళ్లి ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఏదిఏమైనా ప్రియుడితో బిడ్డను కని.. ఇప్పుడు వేరొకరిని పెళ్ళాడుతుంది.. సూపర్ అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.