ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా నిన్న క్రిస్మస్ సెలెబ్రేషన్స్ లో మునిగిపోయారు. గ్లామర్ ప్రపంచంలోని సెలబ్రిటీలు తమ ఫోటోలను, క్రిస్మస్ సందర్భంగా జరుపుకున్న సెలెబ్రేషన్స్ ను వారి అభిమానులతో సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. అదే సమయంలో హాలీవుడ్ పాప్ సింగర్ అరియానా గ్రాండే తన ట్విట్టర్ ఖాతాను తొలగించి అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఈ సింగర్ చెప్పా పెట్టకుండా ట్విట్టర్ ఖాతాను డిలీట్ చేయడంతో అభిమానులకు షాక్ ఇచ్చే విషయం. బహుశా అరియానా సైబర్ బెదిరింపుకు గురయ్యి ఉంటుందని, అందుకే ఆమె ఇలా సడన్ గా ట్విట్టర్‌కు వీడ్కోలు పలికింది అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఆమె అభిమానులు మాత్రం ట్రోలర్లే అరియనా ట్విట్టర్ ఖాతా డిలీట్ చేయడానికి కారణమని భావిస్తున్నారు. అరియానా కొత్త ప్రాజెక్ట్ ప్రకటనతో తిరిగి వస్తుందని కొందరు ఊహాగానాలు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఆమె ట్విట్టర్ ను ఎందుకు వీడిందో తెలియజేయాలని, మళ్ళీ ట్విట్టర్లోకి రావాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో అరియనా యాక్టివ్‌గా ఉండడం గమనార్హం. ఇటీవల అతను వెబ్ సిరీస్ ‘డోంట్ లుక్ అప్’ ప్రమోషన్ పోస్ట్‌ను కూడా ఆమె షేర్ చేసింది. అంతేకాదు ఆమె తన అధికారిక ఇన్‌స్టా హ్యాండిల్ ద్వారా క్రిస్మస్ సందర్భంగా అభిమానులకు శుభాకాంక్షలు కూడా తెలిపింది. అయితే ఆమె ట్విట్టర్ నుండి నిష్క్రమించడం చాలా ప్రశ్నలను లేవనెత్తింది. అరియానా చాలా హిట్ సాంగ్స్ ను అందించింది. ఆమెకు అభిమానుల ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ‘బ్యాంగ్-బ్యాంగ్’, ‘బ్రేక్ ఫ్రీ’ మరియు ‘సైట్ టు సైడ్’ వంటి హిట్ సాంగ్స్ ను ఈ బ్యూటీ పాడింది. ఈ ఏడాది డోంట్ లుక్ అప్ అనే చిత్రంలో ఆమె ఇప్పుడు కనిపించింది. అరియానా ఈ ఏడాది మేలో డాల్టన్ గోమెజ్‌ని వివాహం చేసుకుంది.