Ameesha Patel : సీనియర్ హీరోయిన్ అమీషా పటేల్ 50 ఏళ్ల వయసులోనే ఘాటు అందాలతో నిత్యం రెచ్చిపోతూనే ఉంది. ఆమె తెలుగులో పవన్ కల్యాణ్ తో బద్రి, మహేశ్ బాబుతో నాని సినిమాల్లో చేసింది. సౌత్ లో పెద్దగా అవకాశాలు లేవు గానీ.. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ లో అవకాశాలు అందుకుంది. ఆమెకు అక్కడ బాగానే ఫేమ్ వచ్చింది. ఇక పర్సనల్ లైఫ్ లో ఎంతో మందితో డేటింగ్ చేసింది. కానీ ఎవరినీ పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉండిపోయింది. తాను ఎందుకు సింగిల్ గా ఉండిపోవాల్సి వచ్చిందో తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది ఈ బ్యూటీ. ఆమె మాట్లాడుతూ.. నేను లైఫ్ లో చాలా మందితో డేటింగ్ చేశా. కానీ ఎవరి దగ్గర నిజాయితీ లేదు.
Read Also : Sujith : సుజీత్ తర్వాత సినిమా ఆ హీరోతోనే..?
నాకు ఎవరి దగ్గరా మనస్ఫూర్తిగా ఉన్నానని అనిపించలేదు. నా నిర్ణయాలకు గౌరవం ఇచ్చే వాళ్లతోనే ఉండాలని ఎక్కువగా అనుకున్నా. అందుకే చాలా మందితో డేటింగ్ చేయాల్సి వచ్చింది. అందరూ నన్ను ఒక ఆడదానిలాగా మాత్రమే చూశారు. నా బాడీని చూశారే తప్ప నా మనసును అర్థం చేసుకోలేకపోయారు. అందుకే పెళ్లి పీటల దాకా వెళ్లలేదు. నాకు ఇప్పటికీ పెళ్లి చేసుకోవాలని ఉంది. కరెక్ట్ పర్సన్ దొరికితే మూడు ముళ్లు వేయించుకుని పిల్లల్ని కంటాను అంటూ తెలిపింది ఈ బ్యూటీ. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె ఇప్పుడు రెండు సినిమాలతో బాలీవుడ్ లో చాలా బిజీగా ఉంది.
Read Also : Gouthami : ప్రూఫ్ చూపిస్తే రాళ్లతో కొట్టించుకుని చస్తా.. గౌతమి చౌదరి సవాల్..
