NTV Telugu Site icon

Ambajipeta Marriage Band: ఎక్కడ దొరుకుతాయి సుహాస్ అన్నా.. నీకు ఇలాంటి కథలు

Suhas

Suhas

Ambajipeta Marriage Band: కలర్ ఫోటో సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు సుహాస్. ఈ సినిమా నేషనల్ అవార్డును అందుకుంది. ఈ సినిమా తరువాత ఒక పక్క కమెడియన్ గా నటిస్తూనే ఇంకోపక్క హీరోగా నటిస్తున్నాడు. ఈ ఏడాది రైటర్ పద్మభూషణ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక తాజాగా సుహాస్ నటిస్తున్న చిత్రం అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. దుశ్యంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని GA2 పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ & మహాయాన మోషన్ పిక్చర్స్ బ్యానర్స్ పై ధీరజ్ మొగిలినేని, వెంకట్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఎప్పటిలానే సుహాస్ .. మరో కొత్త కథతో వస్తున్నాడని టీజర్ ను బట్టి అర్ధమవుతుంది.

Biggboss: బిగ్ బాస్ కంటెస్టెంట్ గా కాంగ్రెస్ ఎమ్మెల్యే.. ఏకిపారేస్తున్న జనం

మల్లికార్జున్.. ఒక సెలూన్ ను నడుపుతూనే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ లో డప్పు కొడుతూ ఉంటాడు. ఇక కాలేజ్ లో ఒక అమ్మాయి, మల్లిని ఇష్టపడుతుంది. వీరిద్దరి లవ్ స్టోరీ ఎక్కడివరకు వెళ్ళింది.. ? అసలు మల్లి కథలోకి వచ్చిన మరో ఇద్దరు ఎవరు..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇక చివరిలో సుహాస్ కు గుండు కొట్టిస్తూ ఉన్న షాట్ హైలైట్ గా నిలిచింది. సినిమా కోసం ఏదైనా చేసే సుహాస్.. ఇంత రిస్క్ చేశాడు అంటే.. కథలో ఎంత దమ్ము ఉంటే చేస్తాడో అని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. ఇక మరికొంతమంది ఎక్కడ దొరుకుతాయి సుహాస్ అన్నా.. నీకు ఇలాంటి కథలు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమాతో సుహాస్ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.

Show comments