Ambajipeta Marriage Band: ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ-2 పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న సినిమా ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’. యువ నిర్మాత బన్నీ వాసు, దర్శకుడు వెంకటేశ్ మహా దీనికి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. దుష్యంత్ కటికనేని ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, ధీరజ్ మొగిలినేని ఈ మూవీని నిర్మిస్తున్నారు. షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ ప్రారంభించి ‘కలర్ ఫోటో’తో హీరోగా ఎదిగిన సుహాస్ ఈ సినిమాకు కథానాయకుడు. షూటింగ్ పనులను ముగించుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతుందీ సినిమా. మ్యారేజ్ బ్యాండ్ లో పనిచేసే మల్లి అనే కుర్రాడిగా సుహాస్ ఇందులో నటిస్తున్నాడు. ఈ మూవీ ఆడియో రైట్స్ ను సోని మ్యూజిక్ సంస్థ సొంతం చేసుకుంది. అతి త్వరలో సినిమా విడుదల తేదీని దర్శక నిర్మాతలు ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.
Suhas: ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ ఆడియో రైట్స్ ఎవరికంటే!?

Suhas