Site icon NTV Telugu

Suriya: పోటెత్తిన అభిమానం.. మహేష్ బాబు థియేటర్ అద్దాలు ధ్వంసం

Kanguva

Kanguva

Kanguva: శివ దర్శకత్వంలో సూర్య హీరోగా తెరకెక్కిన చిత్రం కంగువ. టైటిల్ తోనే ప్రేక్షకులలో ఒక రకమైన ఆసక్తి ఏర్పరచుకున్న ఈ సినిమా టీజర్, ట్రైలర్లు చూసిన తర్వాత ఇదేదో గట్టిగా కొట్టేలానే ఉందే అని ఆడియన్స్ అందరూ ఫీల్ అవుతున్నారు. ఈ సినిమాని నవంబర్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేసింది సినిమా యూనిట్. కేవలం తమిళంలోనే కాదు తెలుగు సహా మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సైతం రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ముంబైలో ప్రమోషన్స్ చేసి వచ్చిన సినిమా యూనిట్ ఈరోజు మధ్యాహ్నం బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షో కి హాజరైంది.

Also Read: Matka : తస్సాదియ్యా.. ఏముందీ మట్కా సాంగ్!

ఇక తర్వాత ఏ ఎం బి మాల్ లో కంగువ మీడియా మీట్ కి హాజరైంది. ఇక ఈ సందర్భంగా సూర్యును చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఒకరకంగా ఏఎంబి మాల్ నాలుగో అంతస్తులో ఉన్న ధియేటర్ షట్టర్ను సైతం క్లోజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే సూర్య కారు దిగిన తర్వాత లిఫ్ట్లో పైకి వెళ్ళేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అభిమానులు పెద్ద ఎత్తున విరుచుకు పడడంతో అక్కడ ఉన్న కొన్ని అద్దాలు ధ్వంసం అయినట్టుగా తెలుస్తోంది. ఇక కార్యక్రమం పూర్తయి సూర్య తిరిగి వెళ్ళిపోతున్న సమయంలో ఆయనను లాగి సెల్ఫీలు ఇవ్వమని అభిమానులు ఇబ్బంది పెట్టినట్లుగా తెలుస్తోంది. దీంతో బౌన్సర్లు రంగంలోకి దిగి సూర్యును క్షేమంగా అక్కడి నుంచి బయటకు పంపించారు. మొత్తం మీద ఈ ప్రెస్ మీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

Exit mobile version