NTV Telugu Site icon

Amardeep: ఛీ.. అదొక రీజనా.. నోరు అదుపులో పెట్టుకో.. నా మనోభావాలు దెబ్బతిన్నాయి

Shuba

Shuba

Amardeep: బిగ్ బాస్ సీజన్ 7.. రోజురోజుకు ఉత్కంఠను పెంచుతుంది. మొదటిరోజు నుంచే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మధ్య చిచ్చులు పెట్టడం మొదలుపెట్టాడు. అందుకే మొదటి రోజు నుంచి ప్రతి సోమవారం.. ఆ ఇంట్లో నామినేషన్ సెగలు కక్కుతున్నాయి. ఇప్పటివరకు సిల్లీ.. సిల్లీ రీజన్స్ కు నామినేట్ చేసుకుంటూ వచ్చిన కంటెస్టెంట్స్.. ఇక నుంచి అలాంటి సిల్లీ రీజన్స్ కు తావు ఇవ్వకుండా చేయాలనీ బిగ్ బాస్.. ఇప్పటికే హౌస్ మేట్స్ గా గెలిచిన శివాజీ, సందీప్, శోభా శెట్టిని జ్యూరీ మెంబర్స్ గా నిలబెట్టి.. ఈ నామినేషన్ ప్రక్రియను మొదలుపెట్టారు. ఇక జ్యూరీ సభ్యుల మాట కూడా వినకుండా కంటెస్టెంట్స్ రెచ్చిపోయారు. ఒకరిపై ఒకరు కోపం తో రగిలిపోవడమే కాకుండా జ్యూరీ సభ్యులపై కూడా అరిచారు. ముఖ్యంగా అమర్ దీప్, శుభ శ్రీ మధ్య గొడవ.. పీక్స్ కు చేరుకుంది. నిన్న శుభ శ్రీ.. రతిక, అమర్ దీప్ ను నామినేట్ చేసింది. రతిక బిగ్ బాస్ రూల్స్ ను బ్రేక్ చేసింది అని, బయట ఎక్స్ గురించి మాట్లాడుతూ.. తనను బ్లైండ్ గా నామినేట్ చేసిందని చెప్పుకొచ్చింది. ఇంకోపక్క అమర్ దీప్ టాస్క్ లో ఆడడంలేదని, జుట్టు త్యాగం చేయాల్సి వచ్చినప్పుడు ప్రియాంక చేసిన చొరవ కూడా చేయకుండా పక్కకు వెళ్లిపోయాడని చెప్పింది.

NC23: క్యాస్టింగే కాదు మ్యూజిక్ కు కూడా స్టార్ నే దింపుతున్నట్టున్నారే..?

ఇక అమర్ దీప్ ఛాన్స్ వచ్చేటప్పటికి.. అతను శుభ శ్రీని నామినేట్ చేశాడు. ఓడిపోయాను అని నాగార్జున ముందే ఒప్పుకున్నప్పుడు.. ఆ పాయింట్ ను నామినేషన్స్ లోకి తీసుకురావడం కరెక్ట్ కాదని వాదించాడు. ప్రియాంక తనకు ముందు నుంచే తెలుసు కాబట్టి.. ఆమెతో గట్టిగా మాట్లాడలేకపోయాను అని.. అవును .. ప్రియాంకతో ఫేవర్ గా ఉన్నాను , ఆడుతున్నాను అంటే.. అది తన స్ట్రాటజీ అని చెప్పుకొచ్చాడు. దానికి శుభ.. తనను నామినేట్ చేశాను అని తిరిగి నామినేట్ చేయడం చెత్త రీజన్ అని .. ఛీ అది కూడా ఒక రీజనా అని అడగడంతో అమర్ ఫైర్ అయ్యాడు.. నోరు అదుపులో పెట్టుకోవాలని.. అరవడం మొదలుపెట్టారు. ఇక ఇప్పుడు ఎలా డిఫెండ్ చేస్తున్నారు.. ఇలాంటి నామినేషన్స్ సిల్లీ రీజన్స్ తో అని శుభ కంటనీరు పెట్టుకుంది. ఏదిఏమైనా ప్రతి నామినేషన్ మాత్రం వేరే లెవెల్ ఉంటుందని అభిమానులు అంటున్నారు.

Show comments