Amaran: శివ కార్తికేయన్ టైటిల్ టీజర్ అదిరింది.. కానీ, ఆమె కూడా ఉంటే ఇంకా బావుండేది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amaran: కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. వైవిధ్యమైన కథలను ఎంచుకొని మంచి విజయాలను అందుకుంటున్నాడు. ఈ మధ్యనే అయలాన్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం శివకార్తికేయన్ నటిస్తున్న చిత్రం అమరన్. ఉలగనాయగన్ కమల్ హాసన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, ఆర్ మహేంద్రన్ నిర్మిస్తుండగా, వకీల్ ఖాన్ గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మేజర్ ముకుంద్ వరదరాజన్ నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో, రాహుల్ సింగ్, శివ్ అరూర్ రాసిన ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్ సిరీస్‌లోని ఒక అధ్యాయం ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది. ఇక ఈ చిత్రంలో శివకార్తికేయన్ సరసన సాయిపల్లవి నటిస్తోంది. నిన్న శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఇక ఈ టైటిల్ టీజర్ లో శివకార్తికేయన్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించాడు. కశ్మీర్‌లోని షాపియన్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను తెరకెక్కించారు. టెర్రరిస్టులు దేశాన్ని నాశనం చేయడం.. వారి నుంచి దేశాన్ని కాపాడడానికి ఇండియన్ ఆర్మీ ఏం చేసింది అనేది సినిమాగా తెరకెక్కింది. రాష్ట్రీయ రైఫల్స్ అనే టీమ్‌కు, సౌత్ కశ్మీర్‌లోని ఉగ్రవాదులకు మధ్య జరిగే మధ్య ఏం జరిగింది అనేది ఎంతో అద్భుతంగా తెరక్కించినట్లు తెలుస్తోంది. రచయిత-దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి అమరన్ చిత్రానికి కథ-స్క్రీన్‌ప్లే కోసం చాలా రిసెర్చ్ చేసి రూపొందిస్తున్నారు. ఇది ఇండియన్ సినిమా మాస్టర్ పీస్‌గా మారడానికి సిద్ధంగా ఉంది.శివకార్తికేయన్.. నిజ జీవిత హీరో ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ఒక ప్రత్యేకమైన పాత్రలో అద్భుతమైన నటనతో ఆకట్టుకోనున్నారు. మునుపెన్నడూ చూడని డిఫరెంట్ అవతార్ లో కనిపించాడు. అయితే టీజర్ బావుంది కానీ.. సైపల్లవి షాట్ ఒక్కటి కూడా కనిపించలేదు. దీంతో సాయిపల్లవి ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. శివ కార్తికేయన్ టైటిల్ టీజర్ అదిరింది.. కానీ, ఆమె కూడా ఉంటే ఇంకా బావుండేది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమాతో శివకార్తికేయన్ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
West Bengal: బెంగాల్ బోర్డర్లో టెన్షన్.. తిరిగి వెళ్లేందుకు బంగ్లాదేశీయుల పరుగులు..
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
Spirit : స్పిరిట్.. హీరోయిన్‌తో ప్రభాస్ ఏం చేస్తున్నాడంటే
-
Shubman Gill Record: ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో శుభ్‌మన్ గిల్ రేర్ రికార్డు.. ‘కింగ్’ కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Thopudurthi Prakash Reddy: సోదరుడి అరెస్ట్‌పై తోపుదుర్తి ఫైర్.. మా అన్న అరెస్ట్ అక్రమం
ట్రెండింగ్
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!