Site icon NTV Telugu

Grey Movie: షణ్ముఖ ప్రియ పాటను ఆవిష్కరించిన తమన్!

grey

grey

అరవింద్‌ కృష్ణ, అలీ రెజా, ఊర్వశి రాయ్, ప్రతాప్ పోతన్ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘గ్రే’. రాజ్ మదిరాజు దర్శకత్వంలో కిరణ్ కాళ్లకూరి, మాధురి కాళ్లకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ కోసం ఇండియన్ ఐడిల్ ఫేమ్ షణ్ముఖ ప్రియ పాడిన గీతాన్ని వాలెంటైన్స్ డే సందర్భంగా ఎస్. ఎస్. తమన్ విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పాటకు నాగరాజు తాళ్ళూరి స్వరరచన చేశారు.

‘గ్రే’ అనేది బ్లాక్ అండ్ వైట్‌లో రూపొందిన సినిమా అనేది తెలియచెప్పడం కోసం టీమ్ అన్ని ప్రమోషన్స్ లో బ్లాక్ అండ్ వైట్ థీమ్‌ను ఎంచుకుంది. నాలుగు దశాబ్దాల తర్వాత రూపొందుతున్న తొలి బ్లాక్ అండ్ వైట్ సినిమా ‘గ్రే’ అని, ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని పెంచేలా చేస్తుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. రాజ్ మ‌దిరాజు, షాని సాల్మోన్‌, న‌జియా, సిద్ధార్థ్‌ ఇందులో ఇతర కీలక పాత్రలు పోషించారు.

Exit mobile version