NTV Telugu Site icon

Amala Paul: రెండో భర్తను పరిచయం చేసిన స్టార్ హీరోయిన్.. ఇది ఎన్నాళ్లు అంటున్న అభిమానులు

Amala

Amala

Amala Paul: కోలీవుడ్ స్టార్ హీరోయిన్ అమలా పాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేమ ఖైదీ అనే సినిమాతో అమలా పాల్ కెరీర్ మొదలయ్యింది. తెలుగులో కొన్ని సినిమాల్లో నటించి మెప్పించింది కానీ, విజయాలను మాత్రం అందుకోలేకపోయింది. ఇక కోలీవుడ్ లో మంచి హిట్లను అందుకున్న అమలా.. కోలీవుడ్ డైరెక్టర్ విజయ్ ను ప్రేమించి పెళ్లాడింది. అయితే కొన్ని విబేధాల వలన రెండేళ్లు కూడా నిండకుండానే విడాకులు తీసుకుంది. ఇక విడాకుల అఞ్ఞతరం.. ఈ భామ రెచ్చిపోవడం మొదలుపెట్టింది. లేడీ ఓరియెంటెడ్ మూవీస్ నటిస్తూ, నిర్మిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఇంకోపక్క సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసింది. ఆ సమయంలోనే ఈ చిన్నది.. ముంబైకి చెందిన గాయకుడు భవీంధర్ సింగ్ తో కొన్నాళ్లు ప్రేమాయణం సాగించింది.

Jabardasth: జబర్దస్త్ కు కొత్త యాంకర్.. రంగంలోకి దిగిన జవాన్ బ్యూటీ

ఇక ఈ నేపథ్యలోనే బాయ్ ఫ్రెండ్ భవీంధర్ సింగ్ తో అమలాపాల్ వివాహం జరిగిపోయిందని.. పెళ్లి ఫోటోలు ఇవేనంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు అప్పట్లో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఆ ఫోటోల్లో అమలా పాల్, భవీందర్ సింగ్‌లు పెళ్లి దుస్తుల్లో ఉండటంతో ఈ వార్తలు నిజమే అనుకోన్నారు ఆమె అభిమానులు. ఇక తరువాత అతడు తనను మోసం చేసాడని కేసు కూడా పెట్టింది. ఇక గతకొద్ది నెలల క్రితం అమలా.. నటుడు జగత్ దేశాయ్‌ తో ప్రేమను బయటపెట్టింది. పబ్ లో ప్రపోజ్ చేసిన అతనికి.. లిప్ కిస్ ఇచ్చి రచ్చ చేసిన కొద్దిరోజులకే ఎంగేజ్ మెంట్ చేసుకున్నట్లు కూడా తెలిపింది. ఇక తాజాగా తమ పెళ్లి జరిగిందని పెళ్లి ఫోటోలను షేర్ చేసింది. “రెండు ఆత్మలు, ఒక విధి, ఈ జీవితాంతం నాకు నచ్చిన వ్యక్తితో చేయి చేయి కలిపి నడవడం ఆనందంగా ఉంది” అని చెప్పుకొచ్చింది. ఇక ఏ ఫోటోలు చూసిన అభిమానులు ఈ రిలేషన్ ఎన్నేళ్లో.. అని కామెంట్స్ పెడుతున్నారు. ఇదైనా జీవితాంతం ఉండాలని కోరుకుంటున్నాం అంటూ చెప్పుకొస్తున్నారు.