Amala Paul: పెళ్ళై రెండు నెలలు కూడా కాలేదు.. అప్పుడే మూడో నెలనా.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amala Paul: కోలీవుడ్ హీరోయిన్ అమలా పాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మైనా అనే సినిమాతో కెరీర్ ను మొదలుపెట్టింది. మొదటి సినిమాకే జాతీయ అవార్డును అందుకుంది. ఇక ఈ సినిమా తరువాత తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో ఎన్నో మంచి సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే డైరెక్టర్ AL విజయ్ ను ప్రేమించ పెళ్లాడింది. అయితే వీరిద్దరికి విబేధాలు రావడంతో మూడేళ్లు కూడా నిండకుండానే ఈ జంట విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తరువాత విజయ్ వేరే అమ్మాయిని పెళ్లాడాడు. ఇక అమలా.. విజయ్ తరువాత ఒకరితో ప్రేమలో ఉంది. అతనినే పెళ్లాడింది అనుకొనేలోపు అతడిపైనే చీటింగ్ కేసు పెట్టి పోలీసులకు అప్పగించింది. ఆ తరువాత నిర్మాతగా మారి వెబ్ సిరీస్ లు, సినిమాలు తీయడం మొదలుపెట్టింది. ఇక గతేడాది ఈ చిన్నది జగత్ దేశాయ్ ను వివాహమాడింది.
జూన్ నుంచి డేటింగ్ లో ఉన్న ఈ జంట నవంబర్ లో పెళ్లి చేసుకోనున్నారు. వీరి పెళ్ళి జరిగి రెండు నెలలు కూడా కాలేదు.. అప్పుడే అమలా అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపింది. మేము ముగ్గురం కాబోతున్నామని పోస్ట్ చేసింది. అమలా తల్లి కాబోతుందని తెలియడంతో అభిమానులు షాక్ అవుతున్నారు. అదేంటి.. మీకు పెళ్లి అయ్యి రెండు నెలలే కదా అయ్యింది.. అప్పుడే మూడో నెల ఏంటి.. ? అని కొందరు అడుగుతుండగా.. ఇప్పుడు సెలబ్రిటీలు అందరూ ప్రగ్నెంట్ అయ్యాక పెళ్లి చేసుకుంటున్నారు.. అదే మ్యాజిక్ అని ఇంకొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఏదిఏమైనా అమలాకు చాలామంది శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక అమలా కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఆమె ఆడు జీవితం, ద్విజ సినిమాలతో పాటు లెవెల్ క్రాస్ అనే మూవీలో నటిస్తోంది.
Also Read
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!