Site icon NTV Telugu

Dhamki: విశ్వక్ డాన్స్, నివేత గ్లామర్ అట్రాక్ట్ చేస్తున్నాయి…

Dhamki

Dhamki

యంగ్ హీరో, మాస్ కా దాస్ ‘విశ్వక్ సేన్’ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ధమ్కీ’. పాన్ ఇండియా స్థాయిలో తన మార్కెట్ పెంచుకోవడానికి ట్రై చేస్తున్న విశ్వక్ సేన్, ‘ధమ్కీ’ సినిమాని గ్రాండ్ లెవల్లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఫిబ్రవరి 17న విడుదలవనున్న ఈ మూవీ ప్రమోషన్స్ విషయంలో బాలీవుడ్ స్ట్రాటజీని ఫాలో అవుతున్న విశ్వక్ సేన్, ‘ధమ్కీ’ ఆల్బమ్ నుంచి బయటకి వచ్చిన లిరికల్ సాంగ్ ‘ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా’ సాంగ్ కి వీడియో వర్షన్ ని రిలీజ్ చేస్తున్నాడు. మాములుగా అయితే సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ లో ముందు ఆడియో సాంగ్ ని రిలీజ్ చేసి, సినిమా రిలీజ్ అయ్యాక కొంచెం గ్యాప్ ఇచ్చి వీడియో సాంగ్ ని రిలీజ్ చేస్తారు. బాలీవుడ్ లో మాత్రం రిలీజ్ చెయ్యడమే వీడియో సాంగ్ ని రిలీజ్ చేస్తారు. ఇదే ట్రిక్ ని ఫాలో అవుతూ విశ్వక్ సేన్ ‘ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా’ వీడియో సాంగ్ ని తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ చేశాడు.

లిరికల్ సాంగ్ తోనే అట్రాక్ట్ చేసిన ‘ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా’ సాంగ్ క్యాచీగా ఉందనే ఫీడ్ బ్యాక్ తెచ్చుకుంది. ఇప్పుడు వీడియో సాంగ్ కూడా విజువల్ గా చాలా రిచ్ గా ఉంది. మంచి మంచి లోకేషన్స్ లో షూట్ చేసిన ఈ సాంగ్ లో విశ్వక్ సేన్ చేసిన డాన్స్ ఆకట్టుకుంది. నివేత పెతురాజ్ కూడా తన గ్లామర్ షోతో ఆకట్టుకుంది. లీడ్ పెయిర్ మధ్య మంచి కెమిస్ట్రీ ఉండడంతో, అది సాంగ్ లో మోస్ట్ అట్రాక్టివ్ ఎలిమెంట్ అయ్యింది. మరి సాంగ్ తో ప్రేక్షకులని మెప్పించిన విశ్వక్ సేన్ ‘ధమ్కీ’ మూవీతో పాన్ ఇండియా హీరో అవుతాడో లేదో చూడాలి అంటే వచ్చే ఫిబ్రవరి 17 వరకూ ఆగాల్సిందే.

 

Exit mobile version