ఎట్టకేలకు అల్లు కుటుంబంలో మరో శుభకార్యం జరగబోతోంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చిన్న కుమారుడు, హీరో అల్లు శిరీష్ వివాహ బంధంలోకి అడుగుపెట్టడానికి సిద్ధమయ్యాడు. చాలా కాలంగా తండ్రి, కుటుంబసభ్యులు పెళ్లి విషయంలో ఒత్తిడి చేయగా, చివరకు శిరీష్ అంగీకరించాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆయన సోషల్ మీడియాలో ప్రకటించారు. “తాతయ్య అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా నా జీవితంలోని ఒక ముఖ్యమైన విషయం మీతో పంచుకుంటున్నాను. అక్టోబర్ 31న నయనికతో నా ఎంగేజ్‌మెంట్ జరగబోతోంది. నా పెళ్లి చూడాలని నానమ్మ చాలా ఆశపడ్డారు, కానీ ఆమె ఆ కలను నెరవేర్చుకోలేకపోయారు. అయినా ఆమె ఆశీర్వాదాలు ఎప్పటికీ మాతో ఉంటాయి” అంటూ తన మనసులోని భావాలను పంచుకున్నారు.
Also Read : Akanda 2 : ‘అఖండ 2’ సంగీతం కోసం.. క్లాసికల్ టచ్‌తో గ్రౌండ్ వర్క్ స్టార్ట్
అల్లు అర్జున్ ఇంట్లో జరిగిన దీపావళి వేడుకల్లో నయనిక కూడా పాల్గొనడం, ఆ ఫోటో పొరపాటున అల్లు స్నేహ సోషల్ మీడియాలో షేర్ చేయడం, వెంటనే దాన్ని డిలీట్ చేయడం చూశాం. కానీ మొత్తానికి రేపు నిశ్చితార్థం జరుగుతుండటంతో శిరీష్ ప్రస్తుతం ఏర్పాట్లలో బిజీగా ఉన్నాడు. అయితే వాతావరణం కూడా చిన్న ఆటంకం సృష్టించింది. తుపాను ప్రభావంతో వర్షాలు పడటంతో, ఎంగేజ్‌మెంట్ వేదిక తడిసిపోయిన ఫోటోను షేర్ చేస్తూ, “బయట ఎంగేజ్‌మెంట్ చేసుకుందామని అనుకున్నాం.. కానీ దేవుని ప్లాన్లు మరోలా ఉన్నాయి” అని ఆయన రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ కాసేపట్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది.
